పుట:ముకుందవిలాసము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

ముకుందవిలాసము

సీ. ఆ గుణవతినిఁ జేనందఁగూర్చితివేని
             నీ రమ్యగుణమణుల్ బేరుగాంచు
    నా రామ మదిఁ బ్రేమ నలవరించితివేని
             నీ యశోలతికలు నెఱయఁగలుగు
    నా హంసగమనఁ గ్రీడార్హఁ జేసితివేని
             నీ మానసము రసోన్నిద్రమగును
    నా రమాంశజ నొంది యతిశయించితివేని
             నీ మహాభాగ్యంబు నింపు నింపు
    గాన సంపూర్ణసౌందర్యమానితార్థ
    మదన సామ్రాజ్యసర్వస్వమహిమ యనఁగ
    నందమగు నిందుముఖిఁ బెడ్లియాడితేని
    నీవు భద్రాన్వితుఁడ నౌదు శ్రీవరేణ్య !172

క. రమ్మా మా నగరికిఁ గై
    కొమ్మా మా చిన్ని ముద్దుగుమ్మను రతియే
    సుమ్మా రూపమ్మున లే
    లెమ్మా వేగమ్మ యువతిలీలామదనా !173

సీ. పలుమాఱు చలముచేఁ బడఁతి నేలకయున్న
               బలుమాఱు చలముచే బడలు సుమ్ము
     సతి నిందుకళలంటి రతులఁ దేల్పక యున్న
               జత నిందుకళలంటి జడియు సుమ్ము
     కొమ్మపై నఱలేని కూర్మి నిల్పకయున్న
               గమ్మ పయ్యరనాని కందు సుమ్ము
     మధురాధర మొసంగి మగువఁ బ్రోవక యున్న
               మధురాధర చితాప్తి మసలు సుమ్ము