పుట:మాటా మన్నన.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికం. అది మానవులనే కాదు, పశుపక్ష్యాదులను కూడా ఆకర్షిస్తుంది.

కోకిల పంచమ స్వరాలాపన అందరిని ముగ్ధులను చేస్తుంది. దీనినిబట్టి మనం గ్రహించవలసిందేమిటంటే మధురధ్వని అందరకు సుఖప్రదం, కనుక మధురమైన వాక్కులను మనం వాడాలి.

మధుర సంభాషణ అంటే మృదువైన వాక్కు.లే కాదు, మృదువైన భావం కూడా వుండాలి.

మాట్లాడేటప్పుడు ఒక మధురధ్వనితో మాట్లాడటం ఆవసరం, నీళ్ళు నవులుతూ మాట్లాడటం మంచిదికాదు. అది శ్రోతలలో ఉత్సాహం కలిగించదు. ఆ మాటకు ప్రభావం వుండదు. ఒకరు మాట్లాడే విషయం అంత పటుత్వం లేక పోయినా మాట్లాడే పద్దతి బాగావుంటే శ్రోతలను బాగా ఆగర్షించుతుంది.

మధురంగా మాట్లాడుటకు ఉపమాన పరంపరలు అవసరం లేదు. స్పష్టము, మధుర మైన ధ్వని అవసరం. సకిలించటం, తొస్సిగా మాట్లాడడం, మాటలు మింగటం, ముక్కుతో మాట్లాడటం ఇవేమీ మంచి ఫలితాన్ని ఇవ్వవు. మాట ప్రభావంగా వుండాలంటె ఉద్రేకం అవసరం. మధురంగా మాట్లాడాలని అంటే, తొందరగ కాని, బిగ్గరగకాని, మరీ నెమ్మదిగగానీ మాట్లాడరాదు.

నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుందన్నమాట మరువ రాదు. మాటల ఇంపు సొంపు శబ్దంద్వారానే గాక చూపులవల్ల కంఠస్వరంవల్ల ప్రకటింపబడాలి. నీ హృదయ

22