పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

మహాభారతతత్త్వ కథనము

లను వ్రాసియుండిరి. మన మాపుస్తకములను పరామర్శించుచు వారి విమర్శనపాటవ మేపాటిదో కొంచెము పరీక్షింతము.

———♦♦ప్ర తి వా ది ప్ర సం గ ప రా మ ర్శ ము♦♦———

మహాభారతమునకు వేదవ్యాసమహర్షి యొక్కడే కర్త కాడనియు, వ్యాసుడు, వైశంపాయనుడు, సౌతి యను ముగ్గురు కర్తలనియు, నందు వ్యాసుడు వ్రాసిన గ్రంథమునకు జయ మనియు, వైశంపాయనుడు వ్రాసిన గ్రంథమునకు భారత మనియు, సౌతి వ్రాసిన గ్రంథమునకు మహాభారత మనియు పేర్లనియు, ఆమహాభారతములోనే జయము, భారతము ఇమిడి యుండె ననియు, నవి విడదీయుటకు వీలుగా లేవనియు, నీసంగతు లాశ్వలాయనసూత్ర, మహాభారతవచనములచే స్పష్టమగుచుండెననియు 'మహాభారతమీమాంస' శ్రీకృష్ణ చరిత్రము' 'మహాభారత చరిత్రము' మున్నగు గ్రంథములు ప్రతిపాదించుచున్నవి. అందు ప్రదర్శింపబడిన ప్రమాణము లీవిధముగా నున్నవి:

(1) "వేదా నధ్యాపయామాస మహాభారతపంచమాన్ |
     సుమన్తుం జైమినిం పైలం శుకం చైవ స్వ మాత్మజమ్ ||
     “ప్రభు ర్వరిష్ణో వరదో వైశంపాయన మేవ చ |
     సంహితాస్తైః పృథక్త్వేన భారతస్య ప్రకాశితాః |” (ఆదిపర్వము )

(2) 'సుమంతు జైమిని వైశంపాయన పైల సూత్రభాష్య భారత మహా
     భారత ధర్మాచార్యా:

(3) "అస్మింస్తు మానుషే లోకే వైశంపాయన ఉక్తవాన్ |
     ఏకం శతసహస్రన్తు మయోక్తం వై నిబోధత ||
                                              (అనుక్రమణికాధ్యాయము)

(4) "ఇదం శతసహస్రాఖ్యం శ్లోకానాం పుణ్యకర్మణామ్ |