పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

71


సీ.

చెలియ! [1]నీవను తేప గలిగియుండంగ నే
        నీవిరహాంబుధిఁ నీఁదగంటి
వనిత! నీవనెడు నంజనము గల్గఁగఁ బ్రియుం
        డనెడు నిక్షేపంబు నందగంటి
నతివ! నీవను కల్పలత గల్గ నామనో
        రథపలం బబ్బెను రమణమీర
కలికి! నీవను కామగవి గల్గియుండ నా
        [2]పాలయ్యె నానందలీల లెల్లఁ


తే.

గాంత! నీవు సేసిన యుపకారమునకు
నేనుఁ బ్రత్యుపకారంబు నెట్లొనర్తుఁ?
జెలఁగి నావద్ద నుండెడు చెలులలోన
నువిద! నీవంటి ప్రాణబంధువులు గలరె!

81


వ.

అని మఱియును.

82


క.

వేమారును బ్రియుమాటలె
భామామణి! మగుడ మగుడఁ బలుకు మటంచున్
దామరసేక్షణ నడుగుచు
సామజవరయాన యుండె సంతస మమరన్.

83


క.

శ్రీచెంగమలావల్లభ!
వాచంయమశినుతనామ! వరగుణధామా!
ఆచక్రవాళశైలధ
రాచక్రావనద! విజయరాఘవవరదా!

84


క.

సురసన్నుతనిజచరణాం
బురుహస్మరణప్రవీణభూరిగుణసుధీ
నిరవధికసుఖవిధాయక
గురుకరుణాలహరి! రాజగోపాలహరీ!

85


పృధ్వీ.

చతుర్ముఖసమర్చితా! సకలసంయమీంద్రస్తుతా!
నితాంతకరుణోన్నతీ! మఘవనీలనీలద్యుతీ!

  1. నీపను తేప.
  2. *****