పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

మన్నారుదాసవిలాసము


రాజగోపాలుచందాన రాజముఖుల
నయమునను నేలు దక్షిణనాయకుండు.

36


క.

ఏమి తపం బొనరించితొ!
వామాక్షీ! విజయరాఘవవిభుఁడె కలలోఁ
ప్రేమను నిను లాలించె నిఁ
కేమందును నీదు భాగ్య మేరికిఁ గలదే!

37


క.

చింతిలకుము కాంతిమతీ!
మంతనమున నేనుఁ దెల్పి మచ్చిక వనితా
కంతుని మన్నరుదాసునిఁ
గాంతా! నినుఁ గూర్చి చాల ఘనత వహింతున్.

38


వ.

అని పలుకు సమయంబున.

39


క.

ఆరమణి మది విచారము
జాఱెడుగతిఁ దమము లంత జాఱెన్ మఱి య
న్నారిముఖాబ్దమునం బలె
తూరుపుదిక్కునను దెలివి దోఁచె న్మిగులన్.

40


తే.

అంబుజేక్షణ [1]సకుల ముఖాంబుజములు
చెలువ మలరఁగఁ గడు వికసించినట్లు
సరవిఁ గనుపట్టు నామోదగరిముతోడ
నపుడు వికసించె సరసుల నంబుజములు.

41


క.[2]

జనలోచనోత్సవంబును
వనజకులోత్సవము నొక్కవరుసగఁ గలుగన్
దనకరములు నెరయింపుచు
దినకరుఁ డుదయించెఁ దూర్పుదిక్కున నంతన్.

42


కాంతిమతి యనుమతిఁ గైకొని విలాసవతి విజయరాఘవునొద్దకు బయలుదేరుట

వ.

ఇవ్విధంబున సూర్యోదయంబైన నవ్విలాసవతి కాంతిమతిం జూచి సంత
సంబున నిట్లనియె.

43
  1. సకుల, క. సఖుల
  2. ఈ కందపద్యమునకుఁ బూర్వము క. గ్రంథమున "అంతా" అను వచనము గలదు.