పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

57


మనకు నిటుల సేసిన మేలు మఱువ వశమె!
కొమ్మకోర్కెలు మనము చేకూర్పవలయు.

24


క.

కన్నియ నిందఱ మడిగినఁ
దిన్నఁగ దన మనసుకోర్కెఁ దెలుపదు మనకున్
మున్నుగ నే నొక్కతెనే
యెన్నఁగ నీతలఁపుఁ దెలిసి యిదె వివరింతున్.

25


వ.

మెఱుంగుబోణులార! మీర లందఱు మఱుఁగున నుండుం డని విలాసవతి
కాంతిమతిం జేరి సంతసంబున.

26


సీ.

చెదరిన ముంగురుల్ చెలువంబు మీరఁగాఁ
        గొనగోళ్ళ దువ్వుచుఁ గొ ప్పమర్చి
[1]చిటుల గందఁపుఁబూఁత బటువుగుబ్బల నర
        జారు పయ్యదకొంగుఁ జక్కఁ జేర్చి
డెప్పరంబుగ నంటు పుప్పొడుల్ రాలంగ
        మెఱసిన చెల్మి నెమ్మేను నిమిరి
చెక్కుటద్దంబులఁ జెమటఁ బయ్యద నొత్తి
        యక్కునఁ జేర్చి నెయ్యంబుతోడ


ఆ.

సకులలోన నన్ను జాల [2]లాలింపుదు
ప్రాణపదము గాఁగ పద్మనయన!
చిన్ననాటనుండి చేసిన చెలిమిచే
మగువ! దాఁచ వెపుడు మనసుఁ దనకు.

27


క.

ఎంతటి కార్యం బైనను
కాంతిమతీ! సంఘటింపఁగలదాన నిఁకన్
బంతముఁ బలికెద నీతో
జింతింపక దెల్పు మిపుడు సిగ్గేమిటికే.

28


చ.

అని చెలి బల్కఁ గాంతిమతి యందగరాని తలంపు దీని నే
మని వినిపింతు నీ చెలికి నక్కట! తెల్పక యున్న నన్నిఁకన్
మనసిజుఁ డెట్లు సేయునొకొ! నమ్మిన నెచ్చెలి లేదు దీనిక
న్న ననుచు నెంచి నెమ్మనమునఁ నలుదిక్కులు చూచి [3]యెంతయున్.

29
  1. చిటుల గందపుపూఁత. క. చిటుల గందపుబూఁత
  2. లాలింపుచు
  3. యంతయున్ క. యంతయున్