పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

55

ముక్తపదగ్రస్త సింహావలోకన కందపద్యము

క.

ధీ రాజిలఁ జనవీరా
వీరాయితకేళి నిన్ను వెలకు గొనేరా
నేరాల కేమి రారా
రారాపులు మాని విజయరాఘవధీరా!

16


క.

అని పలికి తెలిసి మఱియును
ఘనముగ నెమ్మనమునందుఁ గాఁకలు [1]హెచ్చన్
వనజేక్షణ భ్రమ నొందుచు
నెనయఁగ నిట్లనియె మగుడ నింతులు వినఁగన్.

17


సీ.

శృంగారముల మించు చెలువైన కాంతు నే
        నెన్నఁడు జూతునే! యింతులార!
తేనెలు [2]గ్రమ్మెడు తేఁటైన కెమ్మోవి
        యాన నెప్పుడు గల్గు? నతివలార!
మెఱుఁగుటద్దమ్ముల మీరు చెక్కుల గోర
        జీరుట యెన్నఁడో? చెలువలార!
సొగసైన తొడలపై సొంపుగాఁ గూర్చుండి
        మాటాడు టెన్నఁడో? మగువలార!


తే.

విరహ మగ్గల మాయెను వెలఁదులార!
తాళలే నింక మరుకాఁకఁ దరుణులార!
విజయరాఘవవిభుఁ దెచ్చి వేడ్కమీరఁ
బొందుగా నన్నుఁ గూర్పరే పొలఁతులార!

18


వ.

అని బహువిధంబుల.

19


కాంతిమతిస్థితి నెఱింగిన సఖులలో నొకతె యగు విలాసవతి యను చెలి కారణం బడుగుట

క.

కాంతిమతి యిట్లు కంతుని
సంతాపముచేతఁ బలుకు సమయమునఁ గడున్

  1. హెచ్చెన్
  2. క. గమ్మెడు