పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

41


తామరసాక్షిరో! తామరకొలనిలో
        వేడ్క నాడుదమమ్మ! వెలయ మనము
వాలుగంటిరొ! నేఁడు వనభోజనము సేయ
        వలె మన మిందఱు వన్నె గాఁగ


తే.

ననుచుఁ జెలు లందఱును దెల్ప విని యొకింత
యవును గా దనలేక యయ్యలరుఁబోణి
యున్న చందముఁ జూచి యాయువిద కప్పు
డూడిగంబులు సవరించు నొఱుపుతోడ.

73


సీ.

రంగుమీరినయట్టి రతనంపుపావలుఁ
        బద్దములఁ గీలించెఁ బణతి యొకతె
జారుపైఁటచెఱంగుఁ జక్కగా సవరించి
        కైదండ నొసఁగెను గాంత యొకతె
బంగారుపనిహర్వు బాగుగాఁ గనుపట్టు
        [1]హరిగ వేడుకఁ బట్టె నతివ యొకతె
జతనఁ బరాకు హెచ్చరిక యటంచును
        సారెకుఁ బలికెను సకియ యొకతె


తే.

యడపమును గిండిఁ గాళంజి నలరుసురఁటిఁ
బొంకముగఁ గొంద ఱతివలు బూని రపుడు
లలితగతి మీరెడు వసంతలక్ష్మి యనఁగ
వనజలోచన యుద్యానమునకు వచ్చె.

74


క.

ఈరీతిని జెలు లందఱు
వారిజముఖిఁ దోడితెచ్చి వైఖరిమీరన్
జేరి యటఁ బొద్దువుచ్చుచు
నారమణిం జూచి పల్కి రప్పుడు వేడ్కన్.

75


సీ.

కొమ్మరో! చూచితే గుంపులై [2]యున్నవి
        చంపకంబులును రసాలములును
గన్నెరో! చూచితే గాటమై యున్నవి
        నారికేళములు పున్నాగములును

  1. హరిగె. క. హరిగె
  2. యున్నది. క. యున్నది.