పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


తే.

యెన్నటికి వాని నేఁ గూడి వన్నెమీర
సరససల్లాపములఁ బ్రొద్దు జరపుచుందు
నెన్నటికి నింక వాఁడు నే నేక మగుచు
నలరుఁ దావియువలె నుందు మందముగను.

66


సీ.

కురులు నున్నగ [1]దువ్వి గొప్పకొ ప్పమరించి
        సొగసుగా విరిసరుల్ జుట్టు నెపుడు
చెక్కిలిఁ బలుమారు నొక్కుచు నెంతయుఁ
        దీరుగాఁ దిలకంబు దిద్దు నెపుడు
కులుకుగుబ్బల వాడిగోరను జీరుచు
        నలఁ గుంకుమగంధ మలఁదు నెపుడు
ముదము మీరఁగఁ బోకముడి సడలింపుచుఁ
        గంతుకేళిని నన్నుఁ గలయు నెపుడు


తే.

గళరవంబులుఁ బలుకుచుఁ గాక దీరఁ
గళల సొక్కించి తేలించి వలపుమించ
విజయరాఘవమేదినీవిభుఁడు నన్ను
నించు వేడుక నోలలాడించు నెపుడు.

67


సీ.

కనురెప్ప వ్రేసినఁ గన్నులకును వానిఁ
        బొడగన్న య ట్లుండు పొలుపుమీర
నెవ్వరు బల్కిన నింపు సొంపగు వాని
        పలుకు విన్నట్లుండు భావ మలర
నెవ్వరు వచ్చిన హెచ్చినతమి వాని
        యడుగుచప్పుడె యని యదరు హృదయ
మేదిక్కుఁ జూచిన నాదిక్కునను వాని
        భావంబు నెలకొన్నపగిదిఁ దోఁచు


తే.

నేమి సేయుదు? నెట్లోర్తు? నిపుడు దనకు
మరునికాక దొలంగించు మార్గ మేమి?
యెవ్వరికి దెల్పు దీమాట? నెలమితోను
విజయరాఘవవిభుఁ గూడువిధ మదెట్లు?

68
  1. డువ్వి. క. డువ్వి.