పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

33


ప్రతిదినం బాచార్యపదములు భక్తిచే
        బూజ సేయుచు నుండు పుణ్యశాలి
సరసుఁ డై సంగీతసాహిత్య విద్యల
        రసికతఁ గాంచిన రాజరాజు


తే.

విజయరాఘవుఁ డని చెలుల్ వినుతి సేయ
వేడ్క వినియుందు వీనులవిందు గాఁగ
నల్ల గోపాలు నాత్మఁజుం డౌట నితని
కతనిగుణములు భాసిల్లె నందముగను.

44


సీ.

చందమామను మించు చందంబుగల మోము
        చిందంబు నందంబుఁ జెనకు గళము
నీరజమ్ములఁ గేరు తీరైన కనుదోయి
        పల్లవంబుల నేలు పాణియుగము
కనకకవాటంబుగరిమఁ బొల్చు నురంబు
        మృగరాజు నదలించఁ దగిన కౌను
బంగారుననఁటుల ప్రతివచ్చు నూరువుల్
        జలజరేఖల మీరు చరణములును


తే.

మొదలుగాగల యవయవంబులు చెలంగఁ
నెందుఁ జూచిన నాచూపులందె నిలిచె
బ్రహ్మ యింద్రున కొసఁగినపగిది వేయుఁ
గన్ను లొసఁగిన వీక్షింతుఁ గాంక్షదీర.

45


సీ.

మస్తు మీరుచుఁ జాల మదముతోఁ జను దెంచు
        గజరాజు నదలించ గమనలీల
పద్మమిత్రుని మించు బాగైన నెమ్మేని
        తేజంబు దిక్కులఁ [1]దేజరిల్ల
ముద్దునెమ్మోమున మురువైన చిఱునవ్వు
        చంద్రికల్ వెదచల్లు సరణిఁ దనర
మాటికి గోపాలు మగుడిచూచిన చూపు
        సింహావలోకనశ్రీల గెల్వ

  1. తేజురిల్ల, క. తేజురిల్ల.