పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

మన్నారుదాసవిలాసము


వ.

అంత.

3O


క.

ఆవంశంబునఁ గృష్ణధ
రావరుఁ డుదయించె నిజకరస్థితచక్ర
శ్రీవత్సశోభితుం డై
తా వెన్నునిరీతి దారితపరాఘుండై.

31


క.

ఆకృష్ణక్ష్మావరునకు
స్వాకృతిమకరాంకుఁ డసమశరదలితపరా
నీకుఁ డగు తిమ్మినాయఁడు
ప్రాకటయశుఁ డుద్భవించెఁ బ్రద్యుమ్నుఁ డనన్.

32


క.

ఆ తిమ్మినృపాలునకున్
ఖ్యాతగుణాలంబ గోపమాంబకుఁ దిమ్మ
క్ష్మాతలపతి యుదయించె ది
[1]శాతతయశుఁ డాహవమున ననిరుద్ధుండై.

33


సీ.

అతులకీర్తివిశాలుఁ డాతిమ్మనరపాలుఁ
        డంగనామణి బయ్యమాంబవలన
నందనులను గాంచె నలువొంద నలువుర
        హరి నలుగే లన నలరువారిఁ
బెదమలభూపాలుఁ బినమల్లనరపతిఁ
        బెదచెవ్వనృపతినిఁ బిన్నచెవ్వ
వసుమతీనాథుని వారిలోపల నల
        చిన్నచెవ్వనృపాలశేఖరుండు


తే. గీ.

శ్రీల విలసిల్లి పట్టాభిషిక్తుఁ డగుచు
భూమిఁ బాలించెఁ బ్రజలకు సేమ మొదవ
రాజగోపాలపదపద్మరాజమాన
[2]మానసాంభోజుఁ డై యసమానమహిమ.

34


క.

అవ్వనజాసను రాణినిఁ
బువ్వులవిలుకానిమామఁ బురహరుగిరి నా
చెవ్వనరపాలుకీర్తులు
నవ్వును నిజధవళిమంబునన్ సంతతమున్.

35
  1. శారతయశుఁ డాహవమున
  2. మానితాంభోజుఁడై