పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

101


తే.

తెఱవ లిరువురు బంగరుతెర ధరింప
నపుడు రతనాల [1]బాసికం బమరఁ బూను
తనయఁ డోడ్కొనివచ్చి యాధరణివిభుఁడు
కులసతియుఁ దాను మిక్కిలి కోర్కెతోడ.

40


క.

ఘనవాద్యంబులు మ్రోయఁగఁ
దనరఁగ ముత్తైదువలును ధవళముఁ బాడన్
మొనసి పురోహితు లప్పుడు
ఘన(తరముగ) మంగళాష్టకంబులుఁ జదువన్.

41


క.

ఘనమణిభూషణసహితయుఁ
గనకసమన్వితయు నైన కన్యామణి నే
మనమున మన్నారునుగా
నిను భావన జేసి యిత్తు నెలకొన శుభముల్.

42


వ.

అని పల్కి.

43


క.

సరిలేని దివ్యరత్నము
వరదక్షిణగాఁగ నొసఁగి వరునకు వేడ్కల్
బరఁగఁగ నీతఁడె హరి యని
వరపుత్రిక ధారవోసె వాంఛిత మమరన్.

44


వధూవరపరస్పరావలోకనము

సీ.

అత్తఱి సుముహూర్త మనుచు నయ్యాచార్యు
        లించువేడుక హెచ్చరించి నపుడె
విజయరాఘవమహీవిభుఁడు కాంతిమతియు
        నొండొరుఁ జూచుచు నుండువేళఁ
జూపులన్ కలువల సుదతి యప్పుడు పతి
        పాదముల్ పూజించు పగుది నుండెఁ
బతి జూపు లప్పు డప్పణఁతిలావణ్యాభి
        బెళఁకు బేడిస లనఁ బొలుపుమీరె

  1. భాషికం