Jump to content

పుట:మధుర గీతికలు.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిజన సోదరా!




‘అంటరానట్టివాఁడవు, కంట నిన్ను
జూచినంతనె పాపముల్ చుట్టు' నంచు
పదరి తిట్టుచు నల్లరిపాలు చేసి
దూరముగ నిన్ను తఱుముచున్నారు జనులు.

తూములను కుళ్ళు, వీథుల తుక్కు నెత్తి
దొడ్లయందలి మలమును తుడిచి నీవు
సకలజనులకు సేవలు సలుపుచుండ,
నైచ్యముగ నిన్ను చూచుచున్నారు జనులు.

అపరిశుద్ధత నోర్మిమై నపనయించి
విశ్వమున కీవు మేలు గావించుచుండ,
అపరిశుద్ధుఁడ వంచు ని న్న ఖిలజనులు
పాఱఁదోలుచునున్నారు పరిభవించి.

65