Jump to content

పుట:మధుర గీతికలు.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది




చందురునిచుట్టు తారకా సముదయంబు
మినుకు మిను కని మెఱయుచు మింటి మీఁద
తమదు సందేశము లొసంగి ధరణి కెల్ల
స్వప్రకాశుని మహిమలఁ జాటుచుండు.

నీలిగోళంబు చుట్టును దేలియాడి
మెలఁగు నివి యన్ని తమ్ము నిర్మించినట్టి
పరమపురుషుని లీలలఁ బాడుచుండు
తమదు నీరవ ముక్తకంఠములతోడ.

30