పుట:మధుర గీతికలు.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెఱువు - సెలయేఱు


“ఏల పాఱెదు సెలయేఱ: ఇంత వడిగ?
మండువేసఁగి వచ్చుచునుండె వేగ,
కూర్చుకొనరాదె యీలోన కొంతజలము? "
అనుచు కాసార మేటితో ననియె నిట్లు.

“చెల్లునే యిట్లు పలుకంగ చెఱువ: నీకు?
తనదు సౌఖ్యము నాసించి మనుటకంటె
పరుల మేలునకై చావ బాగు కాదె? ”
అనుచు సెలయేఱు కొలనితో ననియె బదులు.

భీష్మముగ నంత నరుదెంచె గ్రీష్మ ఋతువు;
చెఱువుజల మెల్ల నెండి నిశ్శేష మయ్యె,
చెట్టుచేమలు శుష్కించె, చేను లెండె,
పులుఁగు లన్నియు నటు నిటు తొలఁగి చనియె,