పుట:భీమేశ్వరపురాణము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

విజ్ఞప్తి.


ఆంధ్రులారా!

మన భాషయం దనేక కవిసార్వభౌము లనేక కబ్బంబుల వ్రచియించి మించిరి. అవియెల్ల నాశుశుక్షణిశిథిలబంధనాది పీడలచేఁ దఱచుగ నశింపఁగా మిగిలినవి కొన్నియేయున్నవి. తక్కినవి కొన్ని నామమాత్రావశిష్టంబులై గ్రంధాంత రోదాహృతస్వపద్యంబులచే వానిమహిమనూహింపఁజాలు పండితవరేణ్యులమనంబులం గడలేని చింత రగుల్కొనఁజేయఁ జాలి యున్నవి. ముద్రాయంత్రాద్యుత్తమ సాధనానుపపత్తిచేఁ బూర్వ మీపీడ యనివార్యంబై యుండె. గాని యిక్కాలంబున నేమో, మిగిలినవానిని భద్రపఱుచుకొని మనకును మన వెనుకటివారికిని భద్రంబొనగూర్పఁదగు నుపాయంబు లనేకము లేర్పడియున్నవి. వీనిని మన మెట్లుపయోగించుచున్నాము? దాన మన భాషయందలి గ్రంథసంచయ మెంత రక్షనొందినయది? యనుట నాలోచింపవలసియున్నది.

ప్రకృతమందు మన భాషయందు విలువకుం దొరకు గ్రంథముల రెండు తెఱంగుల విభజింపనగు. ఉల్లిపొరలవంటి కాగితంబులపైఁ దగిలియుఁ దగులక యచ్చొత్తింపఁబడి తప్పులకుప్పలై యతి దూష్యంబులై నెగడు 'గుజిలీ' పుస్తకములు కొన్ని, ఇపుడుండెడు పుస్తకములలో మూఁడుపాళ్లిట్టివియే. వీని వెల సులభమ కాని ఫలము సున్న. వీనియందువర్ణలోపంబులె లెక్కకుమిక్కుటంబులై యున్నవన నిఁకఁగేవలము పండితవేద్యంబు లగుగణయతిప్రాసాదిలక్షణవైపరీత్యంబుల సంగతి వేఱుగఁ జెప్ప వలయునా? దీనికి నుదాహరణంబుగ నిట్టిగ్రంథ మొకదానినుండి యీ క్రిందిపద్య ములందున్న రీతిని ముద్రింపించుచున్నాము. చూడుఁడు.

కం. "అటువచ్చినహరుడల్ల, మతటుకునదయ జూచిలేచి తనపీఠిక నొ
     క్కటనునిచియిష్టబాషలు, నిడియించియతండరుగ గౌరినాధునికనియెన్."

కం.“సాకారుం డొదలపగని, రాకారుడొ యాదిపురుషాకృతి యిపుడుం, గైకొనిన
     ఘనుడో యిట్లని, యాకలాత్మజుడైన నలవియె బొగడన్."

యిటుగాక మంచికాగితములపై నచ్చొత్తింపఁబడి చదువుటకుముందు చూచుట కింపగునట్లు సంపుటీకరణముగావింపఁబడియుండు నొక కొన్ని గ్రంథంబు లిపుడిపుడు పొడసూపుచున్నయవి. ఇవి పండితపరిష్కృతంబులై నెగడుటచే వీనియందుఁ దప్పులు నంతగఁ గానరావు. అయినను వీని వెల యధికమగుటచేఁ బైకనిన 'గుజిలీ' పుస్తకములకును వీనికిని సవతిపోరు వాటిల్లఁగాఁ జిన్నతనంబుచే వన్నె కెక్కు నయ్యవి