Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్ధరణిం గంటిమె వింటిమే త్రిజగతీధౌరేయభావంబు ను
ద్ధురకోదండసమగ్రకౌశలము నస్తోకప్రభావంబు సం
గరచాతుర్యము నస్త్రసంపదయు నుగ్రస్ఫారవిశ్రాంతియున్.

1460


చ.

అరుదుగఁ జెప్పనైనఁ దడవయ్యెడు రాముఁడు విల్లు పట్టినన్
దురమునఁ దిట్టినట్టు గతదోర్బలు లై రజనీచరుల్ పొరిం
బొరి నిమిషార్ధమాత్రమునఁ బొల్పును రూపును దప్పి సంగర
స్ఫురణము దూలి వే పొలిసి పోయిరి కాలునిప్రోలు సూడఁగన్.

1461


క.

వరవారణాయుతంబులు, నురుతరజవతురగవివిధయూథశతంబుల్
గురురథసహస్రములుఁ గా, ల్వురలక్షలుఁ గూలె రాఘవునిరణలీలన్.

1462


శా.

వాలాగ్రంబునఁ బంక్తికంఠుని వెసన్ వ్రాలంగ బంధించి నా
నాలీలం జతురంబురాసుల ననూనస్ఫూర్తియై ముంచి యు
ద్వేలం బైనభుజాబలంబున జగద్విఖ్యాతుఁ డై యున్న యా
వాలిం గూలిచె నొక్కబాణమున దుర్వారుం డితం డెన్నఁగన్.

1463


క.

పుష్కలకరుణాసంధా, విష్కరణము తేటపడఁగ వేడుకతోడన్
దుష్కరముగ రవితనయుం, గిష్కింధకు రాజుఁ జేసెఁ గేవలనరుఁడే.

1464


సీ.

కమలజాండము నొక్కకడి చేసికొని మ్రింగ, నరుదెంచుచున్నకాలాంతకుండొ
జగము లన్నియు నొక్కమొగి సమయింపంగ, మెయికొని గమకించుమృత్యువొక్కొ
భూతకోటుల నెల్లఁ బొరిఁబొరి నొకమాత్ర, రూపఱఁ జేయునారుద్రుఁడొక్కొ
కమలగర్భుఁడు వినోదమునఁ జేసిన వచ్చు, పొలుపైన[1]జంత్రంపుబొమ్మయొక్కొ
యనఁగ నింద్రాదిసురులకు మనసులోనఁ, గలయ నాటినశల్యంబుకరణి నున్న
కుంభకర్ణునిరణమునఁ గూల్చె నితఁడు, గులిశహస్తుండు కుదరంబుఁ గూల్చుపగిది.

1465


మ.

కులగోత్రప్రతిమానసారుఁ డనియుం గోదండపాండిత్యని
శ్చలసత్త్వుం డనియున్ భుజంగకులరాజస్ఫీతదృప్యద్భుజా
ర్గళరూఢుం డనియున్ రఘుప్రవరు నాకర్ణించియున్ నేరమిం
జల మొక్కింతయు డింపఁ డిట్లు దనకున్ శక్యంబు గా కుండఁగాన్.

1466


చ.

అతులపరాక్రమాప్రతిము నయ్యతికాయుని మేఘనాదు న
ప్రతిహతశౌర్యభూషణుఁ [2]డపారబలుం డగులక్ష్మణుండు సం
తతశితబాణపూరముల దర్ప మడంచి వధించె వానరుల్

  1. సూత్రంపుబొమ్మ
  2. నిరర్గళసత్యుఁడు లక్ష్మణుండు