Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అడిదము నేల వైచి సముదగ్రత నంగదు నాప్రజంఘుఁడుం
బిడికిట బిట్టుగాఁ బొడువ బిమ్మిటిపోవుచుఁ దేఱి కన్నుల
న్మిడుఁగుఱు లుప్పతిల్ల నతినిష్ఠురవృత్తి శిరంబు నుగ్గుగాఁ
బొడిచిన నంత వాఁడు మృతిఁ బొందెఁ గపీశ్వరు లుబ్బి యార్వఁగన్.

1191


క.

పినతండ్రిచావు గని య, ద్దనుజుఁడు యూపాక్షుఁ డంతఁ దరవరి గొనుచుం
దనరథము డిగ్గి సింహ, ధ్వని యెసఁగన్ ద్వివిదుఁ దాఁకె దర్ప మెలర్పన్.

1192


క.

కోపాటోపము గదురఁగ, యూపాక్షు నతండు [1]పొడిచి యురవడిఁ బట్టెన్
రూపఱ సింహము గలభము, నేపారఁగఁ బొదువుభంగి నిద్ధబలుం డై.

1193


మ.

అనుజుం డుద్ధతి శోణితాక్షుఁడు రణవ్యగ్రాగ్రహోదగ్రుఁ డై
చను దేరంగ లయాంతకోపముఁడు వక్షంబుం బొరిం దాఁచినన్
ఘనసత్తాఢ్యుఁడు మేను జిఱ్ఱ దిరుగంగా మూర్ఛచే వ్రాలినం
జనియెనే నే విడిపించి యద్భుతభుజాశ్లాఘాసముల్లాసి యై.

1194


మహాస్రగ్ధర.

చటులౌద్ధత్యంబుతోడన్ సరభసగతి యై చండదోర్దండసత్త్వో
ద్భటుఁ డత్యుగ్రప్రతాపప్రతిహతదివిజప్రాభవుం డేఁగుదేరం
గుటిలభ్రూవిక్రియాసంక్షుభితదనుజుఁ డై ఘోరముష్టిన్ శిరంబుం
[2]ద్రుటితంబుం జేసి యార్చెన్ ద్రుతగతి నద్రువన్ దోన దిగ్జాల మెల్లన్.

1195


వ.

ఇట్లు ద్వివిదుండు శోణితాక్షుం దెగటార్చె నంత యూపాక్షుండు మైందుతోడం
బోరునవసరంబున.

1196


ఉ.

బల్లిదుఁ డైనవానరుఁడు బాహుబలంబునఁ బట్టి యుద్ధతిం
బ్రల్లదుఁ డైనరక్క సునిపక్కలు వ్రక్కలు గాఁగ నేలతో
గుల్లలతిత్తిగా నదికి ఘోరవధం బొనరించి యల్క సం
ధిల్లఁగ నార్చె దైత్యులు మదిన్ భయ మంది కలంగఁ బాఱఁగన్.

1197


తే.

క్రోలుపులిఁ గన్నమృగములఁ బోలి కన్న, గతులఁ బాఱుచు నున్నరక్కసులఁ జూచి
మగుడఁ బెట్టుటకై వారిబెగడు దెలిపి, నిలువఁబడి యున్నవానరబలముఁ గాంచి.

1198

సుగ్రీవుండు కుంభునిం జంపుట

సీ.

దర్వీకరాధీశదర్పహం బగుచున్న, విపులసారం బైనవిల్లు దాల్చి
[3]కమనీయమణిమయకనకాంగదప్రభా, విలసనంబులు దెసల్ గలయఁ బర్వఁ
దరువంగఁబడుసముద్రముమ్రోఁతవడువున, శింజినీటంకృతుల్ చెలఁగఁజేసి
రోదోంతరవ్యాప్తి రూఢ మై నీరంధ్ర, బాణపరంపరాభరము నిగుడ

  1. నొడిసి ..... వేపారఁగఁ బట్టుభంగి
  2. ద్రుటితం బైపోవఁ జేసెం దెస లద్రువఁగ నందీకృతాశేషుఁ డౌచున్.
  3. కమనీయతరకనత్కనకాంగద