| |
దేవలయుఁ బోయి ర మ్మని, దీవించుచు వీడుకొలుపఁ దిర మగు వేడ్కన్.
| 1094
|
హనుమంతుండు సంజీవనిఁ దెచ్చుట
| క. |
వే చని చేయుదు నిప్పని, కేచింతయు నేటి కనుచు నేతెంచి నట
ద్వీచీసంఘట్టనమున, వాచాలం బైనలవణవారిధిచెంతన్.
| 1095
|
| క. |
అమరుసువేలము గని వేగమ యాగిరి యెక్కి రాముకార్యము నిర్వి
ఘ్నముగం జేయం గృపసే, యుము భూధర నాకు ననుచు నుత్సాహమునన్.
| 1096
|
| ఉ. |
పుట్టినవిక్రమస్ఫురణఁ బొంగినమే నతిఘోరభంగికిం
[1]బట్టుగ నేపుమై నిలిచి బాహులు సాంచి మహాట్టహాససం
ఘట్టన లంక గ్రక్కదలఁగాఁ గపివీరుఁడు దాఁటె [2]దాఁటునన్
మెట్టినకొండ గ్రుంగఁబడి మేదిని బీఁటలు వాఱ మింటికిన్.
| 1097
|
| క. |
వడి దాఁటుమేనిగాలిం, గడలెత్తి పయోధి మ్రోయఁ గా మేఘంబుల్
సుడిగొనుచుఁ జెదరి దిక్కులు, గడవం బఱవం బ్రచండగతి నటు చనుచున్.
| 1098
|
| చ. |
కలధౌతాద్రితటాంతరిక్షమునఁ జక్కం బాదముల్ మీఁదుగాఁ
౦దె
దలక్రిం దై కరపద్మముల్ నుదుట నందం బొంద జేపెట్టుచున్
లలి నాశంకరుశైలముం గడచి [3]బాలస్వేద మాస్యంబుపై
వలియం గ్రమ్మఁగఁ గ్రమ్మఱం దిరిగి పోవం బోవఁగా ముందటన్.
| 1099
|
| మ. |
అమృతాంశుద్యుతిజాలశీతలవికీర్ణాంభఃకణస్యంది యై
చెమటార్పన్ వలిగాలి రాఁగ నెదురన్ క్షీరాబ్ధిఁ గాంచెన్ నగో
త్తమమంథక్షుభితాంతరంగము ధరదైత్యారిశయ్యాభుజం
గము నుత్తుంగతరంగముం గృతవియృద్గంగాపరిష్వంగమున్.
| 1100
|
| క. |
కని యాజలధికి మ్రొక్కుచు, జని యుత్తరతీరభూమి సరి మూఁ డద్రుల్
ఘనవీథి దాఁకి యుండఁగ, వినువీథిం జేర నరిగి వికసితముఖుఁ డై.
| 1101
|
| క. |
కెలఁకులఁ జెన్నగునీనగ, ములు చంద్రద్రోణశైలములు మధ్యమునం
బొలుచు నిది యౌషధాచల, మలఘుతరద్యుతులు వెలుఁగు నవి యాతీఁగల్.
| 1102
|
| క. |
అనుచు నగోపరిభాగం, బునకుం జనుదెంచి వాయుపుత్రుం డచటన్
మును వెలిఁగెడునాలతికలు, కనుఁగవకుం దోఁపకున్నఁ గడువిస్మితుఁ డై.
| 1103
|
| సీ. |
కొండొక చింతించి కొండతో నిట్లను, హనుమంతుఁ డనువాఁడ నఖిలలోక
[4]కంటకుఁ డగుదశకంఠునిఁ దెగటార్ప, నాలంకపై దొర లట్లు విడిసి
సంగరక్రీడల శత్రువీరులచేతఁ, బోటేటుఁ బడి తూలి పుడమిఁ బడిన
వారి నందఱఁ దేర్పవలసినమందులు, నీయందుఁ గలుగుట నిక్క మెఱిఁగి
వచ్చినాఁడ నింక వంచన యేటికి, నెలమి నౌషధంబు లిత్తుగాక
|
|
- ↑ బ ట్టగుమూఁపునై నిలిచి
- ↑ దాపునన్ మెట్టిన
- ↑ ఫాలస్వేద
- ↑ కంటకు దశకంఠుఁ గడతేర్ప లంకపై, విడిసిన యారఘువీరు బంట, సంగర