Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జ్జ్యాచంచద్ధనురభ్రముక్తవిశిఖాసారంబు ఘోరంబుగా
వీచీబంధురరక్తసింధువులు గావింతుం బ్లవంగాంగముల్
వే చెండాడుదుఁ దెత్తు దీనదశకున్ వే యేల భూపాలురన్.

737


క.

ధనములపైఁ దనయులపై, వనితలపై బంధుమిత్రవర్గముపైఁ [1]బు
ట్టినప్రియమునకంటెను నీ, కనిఁ బ్రాణము లిచ్చునదియ కడుఁబ్రియ మధిపా.

738

ప్రహస్తుండు నీలునితో యుద్ధము చేసి చచ్చుట

వ.

అని పలికి బలాధ్యక్షులం జూచి మీరు సర్వసన్నాహసమేతులరై సేనలం గొని
రం డని నియోగించిన నాకు నట్ల కావింప నప్పంక్తికంధరు వీడ్కొని పటహాది
మహాభైరవారావంబులు సెలంగం జనుదెంచి.

739


సీ.

నేమిఘట్టనముల నేల వ్రక్కలు సేయఁ గడఁగుచందమునఁ జక్రంబు లెసఁగ
గరువలిజవమును గడచను నన్నట్లు, తరళితగతుల రథ్యములు మెఱయ
భానుబింబము నుద్దిపట్ట నూఁకించుపొ, ల్పున నహిధ్వజము నాలుకలు గ్రోయ
నితరరవంబుల నెల్ల నుల్లసమాడు, క్రియ మణిరణితకింకిణులు మొరయ
[2]హేమరశ్ములు హిమధామురశ్ములచెల్వు, గెలువ సూతుఁ డప్పు డెలమిఁ దేరు
పన్ని తేర నెక్కి బలములతోఁ బ్రహ, స్తుండు వెడలె లంకతూర్పుగవని.

740


క.

వెడలి మహోత్పాతము లెడ, నెడఁ బెక్కులు గనియు వాని నింతయుఁ గొన కె
క్కుడువడి సేనాభరమునఁ, బుడమి వడంకాడ నతఁడు పోరికి నడచెన్.

741


వ.

అప్పుడు.

742


క.

 జననాథుండు విభీషణుఁ, గనుఁగొని యీవచ్చుసమరగర్వితుఁ డెవ్వాఁ
డనిన నితండు ప్రహస్తుం, డనువాఁడు సమస్తసేన కధిపతి వీటన్.

743


ఉ.

మూఁడవభాగ మీబలసమూహము రావణుసేనలోన నే
నాఁడు దశాస్యుఁ డీతనిన నచ్చి మదోద్ధతవృత్తి నుండు నె
వ్వాఁడును నింతచెల్లుబడివాఁడు నరేశ్వర లంకలోపలన్
లేఁ డితఁ డెప్పుడున్ సమరలీలల ముక్కునబంటి వజ్రికిన్.

744


తే.

అనఁగ నసిగదాముసలచక్రాదిసాధ, నములు మెఱుఁగులు వాఱంగ నలిఁ జెలంగి
యామినీచరుల్ ద్రోచిన నద్రిచరులు, వీఁక నార్పులతో వచ్చి తాఁకి రపుడు.

745


సీ.

ఏనుంగు లడరిన నెసఁగుబొందులు రూపు, సెడి నల్గడలఁ జెల్లచెదరు గాఁగ
నరదంబు లురవడి వడరినపట్టులఁ, బీనుంగుపెంటలు పెల్లు గాఁ గ
సొరిది ఘోటకములు సొచ్చినచోటులు, నవయవభేదంబు లరుదు గాఁగఁ
గాల్వు రొక్కుమ్మడిఁ గడఁగినఠావుల, నెత్తురువఱదలు నెఱవు గాఁగ
రక్కసులు విక్రమింప మర్కటులు గడఁగి, విపులపాషాణపర్వతవృక్షవృష్టి

  1. బుట్టినప్రియము దైనకంటెను, ననిఁ బ్రాణము లిచ్చునది ప్రియము నా కధిపా.
  2. మోమురశ్ముల హిమధాము