పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జలియన్‌ వాలా బాగ్‌లో నేలరాలిన ధీరమాత

' షహీద్‌ ' ఉమర్‌ బీబీ

(1864 - 1919)

మాతృభూమిని విముక్తి చేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి పరాయి పాలకుల మీద విజృభించిన ఘట్టాలలో పురుషులతోపాటు స్రీలు కూడ సాహసోపేత భాగస్వామ్యం వహించారు. ఈ మేరకు సాగిన అహింసాయత పోరాటాలలో పాల్గొని బ్రిటిష్‌ పోలీసుల హింసకు ప్రాణాలను అర్పించిన అమరజీవుల జాబితాలో ఉమర్‌ బీబీ అరుదైన స్థానం సంపాదించుకున్నారు.

పౌరుషానికి పోతుగడ్డ దైర్య సాహసాలకు పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచిన పంజాబ్‌ రాష్రం లోని అమృతసర్‌ జిల్లా, దుల్లా (DULLA) గ్రామంలో ఉమర్‌ బీబీ 1864లో జన్మించారు. బానిస బ్రతుకును సహించలేని రైతుకుటుంబంలో పుట్టిన ఆమె స్వతంత్ర భావాలను అలవర్చుకున్నారు. ఆమెకు ఇమానుద్దీన్ తో వివాహం జరిగింది. (Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH, New Delhi, 1983, Page.97)

మాతృభూమి పట్ల అపార గౌరవాభిమానాలు గల మహిళ ఉమర్‌ బీబీ. జాతీయ ఉద్యమ విశేషాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ అనుకూలాంశాలకు ఆనందం, ప్రతికూల అంశాల పట్ల బాధను వ్యక్తం చేస్తూ వచ్చారు. స్వదేశీయుల మీద విరుచుకు 73