పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జుగాంతర్‌ విప్లవ దళం వీరవనిత

రజియా ఖాతూన్‌

భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రజానీకాన్నిఅన్ని రకాల త్యాగాలకు సిద్ధపర్చింది. అహింసామారంలో బ్రిటిష్‌ సేనల తుపాకి గుండ్లకు బలైన ఖుదాయే- ఏ-ఖిద్మత్‌గార్‌లనూ (భగవత్సేవకులు), ఆయుధాలను చేతపట్టి బ్రిటిష్‌ పోలీసు-సైనిక దాళాలను తొడగొట్టి సవాల్‌చేసి రణరంగంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను బలిపెట్టిన విప్లవకారులనూ జాతీయోద్యామం సృజియించింది.

బ్రిటిషర్ల బానిసత్వం నుండి విముక్తి కోరుకుంటూ సాగిన ఈ పోరాటాల మార్గాలు ఏవైనా అందులో పురుషులతోపాటు మహిళలు కూడ నడుంబిగించి మున్ముందుకు సాగారు. విముక్తి పోరాటంలో ఏమాత్రం వెన్ను చూపక ఆయుధం చేపట్టి బ్రిటిషర్ల వెన్నులో చలి పుట్టించారు. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రభుత్వాన్నిసవాల్‌ చేసి హడలగొట్టిన ఆడపడుచులలో రజియా ఖాతూన్‌ ఒకరు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర పుటలలో అగ్నియుగం గా పిలువబడిన సాయుధ పోరాట కాలంలో జుగాంతర్‌, అనుశీలన సమితి, ఆత్మోన్నతి దళం, గదర్‌ విప్లవ దళం, హిందాూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ తదితర విప్లవ దళాలలోని విప్లవవీరులు అపూర్వ ధైర్య సాహసాలతో, అసమాన త్యాగాలతో అగ్నియుగాన్ని రగిలించారు. అటువంటి విప్లవ


71