పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ సైనిక బలగాలను సవాల్‌ చేసిన యోధురాలు

బేగం హజరత్ మహాల్

(-1874)

మాతృభూమి కోసం ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిీటిష్‌ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహాల్‌. ప్రదమ స్వాతంత్ర సంగ్రామం

తొలిదాశలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులతో రాజీబేరాలు కుదుర్చుకునే ప్రయత్నాలు

చేసి, అవి విఫలమై చివరకు మార్గాంతరం లేక పోరు మార్గం ఎంచుకున్నరాణుల్లా కాకుండ, ఆది నుండి కంపెనీ పాలకులను శత్రువులుగా పరిగణించి, మాతృదేశ పరిరక్షణారం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయుధ పట్టక తప్పదని ప్రకటించి, అత్యంత ధైర్య సాహసాలతో రణభూమికి నడిచిన వీరనారీమణి బేగం హజరత్‌ మహాల్‌. ఆమె ఉత్తర భారతదశంలోని అత్యంత సంపన్నవంతమై న అవధ్‌ రాజ్యం అధినత నవాబ్‌ వాజిద్‌ అలీషా సతీమణి.ఆమె స్వస్థలం మాత్రం ఉత్తర పదశ్‌ రాష్రంలోని పైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహమ్మద్‌ ఖానం. ఆమె అందాచందాలకు గురించి విన్న నవాబు వాజిద్‌ అలీ షా ఆమెను కోరి మరీ వివాహమాడాడు. వివాహం తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. వివాహం తరు వాత ఆమెకు ఇఫకారున్నీసా (నారీమణి) అని పేరుపెట్టాడు భర్త. ఆమెకు సుగంధ కన్య అని బిరుదు కూడ ఇచ్చాడయన. 37