పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంఫిుక బహిష్కరణలకు వెరవని ధీమంతురాలు

హాజఁరా బీబీ ఇస్మాయిల్‌

(-1994)

జీవిత భాగస్వాములతో పాటుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని త్యాగాలతో చరిత్ర సృష్టించిన మహిళల జీవిత విశేషాలను కొంతలో కొంతవరకు జాతీయోద్యమ చరిత్ర మనకు అందిస్తుంది. బానిస బంధానాల విముక్తి కోసం పోరాడుతున్న సహచరుడు కన్నుమూసినప్పటికీ ఆయన నడిచిన సన్మారం వీడకుండ, ముందుకు సాగిన మహిళలు అరుదుగా కన్పిస్తారు. శ్రీమతి హాజౌరా బీబీ అటువంటి అరుదైన మహిళామణులలో ఒకరు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధుడు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ సాహెబ్‌ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆయన భార్య హాజౌరా బీబీ. గాంధీజీ ప్రబోధంతో ప్రభావితులైన ఆయన ఖద్దరు ప్రచారోద్యమంలో అమితోత్సాహంతో పాలుపంచుకున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఖద్దరు దుకాణం ప్రారంభించి, ఖద్దరు ప్రచారంలో నిత్యం నిమగ్నమై ఉండే భరకు హాజౌరా బీబీ అపూర్వమెన తోడ్పటునిచ్చారు.

అఖిల భారత ముస్లింలీగ్‌ ప్రభావం తెనాలిలో కొంత ఉండేది. ఖద్దర్‌ ఇస్మాయిల్‌ దంపతులు భారత జాతీయ కాంగ్రెస్‌లో కొనసాగటం, గాంధీజీ విధానాల పట్ల అత్యంత 227