సయ్యద్ నశీర్ అహమ్మద్ 96
మీనన్, శ్రీ టి.వి. చత్తు కుట్టీ మీనన్, శ్రీ యం.పి. నారాయణ మీనన్, శ్రీ ఎలియా నాయర్,
జనాబ్ మహ్మద్ అబ్దుర్రహ్మాన్ సాహెబ్, మౌల్వీ ఖాదర్ మొహిద్దీన్, మౌల్వీ మోడుకొయా,
జనాబ్ పి. మొడుకోయా, జనాబ్ కె ముహమ్మద్ ముస్సలియార్, జనాబ్ మోహిద్దీన్ కోయా
తదితరులు సభ్యులు.
ఈ సందర్భంగా హిందూ సోదరులతో సఖ్యతగా మెలగాలని, ఎటువంటి పరిస్థితులలో
వారికి కష్టం - నష్టం కలిగించకుండా చూడాలని ముస్లిం ముల్లాలు, తంగల్స్ కోరటంతో
హిందూ-ముస్లింల మధ్య పటిష్టమైన స్నేహసంబంధాలు వ్యక్తమయ్యాయి. ఒత్తపాలెం
(OTHAPALAM ) గ్రామంలో హిందూ సోదరులు దేవుడ్ని ఊరేగిస్తుండగా, అందులో
పాల్గొన్న వారికి ముస్లింలు కొబ్బరి బొండాల నీళ్ళతో దాహం తీర్చిన అరుదైన సలు
సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనూహ్యమైన ఈ ఐక్యత బ్రిటీష్ అధికారులను షాక్కు
గురిచేసిందని, ప్రముఖ రచయిత డాక్టర్ రొనాల్డ్ మిల్లర్ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆనాడు
హిందూ-ముస్లిం జన సముదాయాల మధ్య వ్యక్తమైన స్నేహసంబంధాల స్థాయి, పటిష్టత
తెలుస్తుంది.
మౌలానా షౌకత్ అలీ ప్రసంగాలు
1920 ఆగస్టు 18న కాలికట్లో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో మహాత్మా గాంధీ,
మౌలానా షౌకత్ అలీ పాల్గొన్నారు. ఆ సభలో మోప్లాలు సహాయ నిరాకరణ ఉద్యమంలో
పాల్గొనటం, ఇస్లాం ప్రకారం ధర్మసమ్మతమని, ఖురాన్ ప్రకారంగా సహాయ నిరాకరణ
అనుసరణీయమని ప్రకటించారు. ఈ మార్గంలో లక్ష్యాలను సాధించుకోలేకపోయినట్టయితే
మరింత తీవ్ర చర్యలకు, త్యాగాలకు తయారుకావాల్సి వస్తుందని షౌకత్ అలీ ఇచ్చిన పిలుపు
మోలను ఉత్తేజపర్చింది. ఆ పిలుపుతో మోప్లాలు మరింత ఉత్సాహంతో కార్యక్రమాలలో
పాల్గొన్నారు. మౌలానా ప్రసంగాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆ ప్రసంగాలు
మోప్లాలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, మందు దట్టించి ఉన్న ఫిరంగికి మౌలానా ప్రసంగాలు
వెలిగించిన అగ్గి భరాటాల్లో పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలవని పాలకవర్గాలు భావించాయి.
"... ఆయన ప్రసంగాలు మోప్లాల నుంచి ప్రమాదం కొని తెచ్చేవిధంగా ఉన్నా...” యని,
CHIEF SECRETARY OF MADRAS TO THE GOVERNMENT OF INDIA,
ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే షౌకత్ అలీ
ఎక్కడ ప్రసంగాలు చేసినా బ్రిటీషర్ల మీద పోరాటం చేయటం అధర్మం, అన్యాయం,
అక్రమం మీద పోరాడటమేకాక అల్లాహ్ మార్గాన పోరాడటమేనన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని
స్థాపించటం కోసం మరణించటం గాని, ఆ కార్యసాధనలో సాగుతున్న వ్యక్తులకు అడ్డుగా
నిలిచే అధర్మవర్తనులను చంపటంకాని తప్పుకాద న్నారు. ఈ పోరాటాలలో గాంధీజీ
ప్రబోధించిన అహింసా మార్గంలో నడిచేందుకు ముస్లింలు వాగ్దానం చేసియున్నారంటూ,
ఆ మార్గంలో నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోలేనట్టయితే, ముస్లింలు తమదైన మార్గాన్ని తామే
నిర్ణయించుకోవచ్చునని ఆయన ప్రవచించారు. ఈ సందర్భంగా కొందరు ధార్మిక నేతలు,
గతంలో మోప్లాలు అనుసరించిన ఆత్మార్పణలను కూడదంటూ ప్రచారం చేసారు.'
శత్రువు దాడిచేసినప్పుడు, తప్పించుకోలేనప్పడు, చావు తప్పదన్నప్పుడు, చివరికంటా రక్షణ