Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 74

‘...ఆయనను ఫరాజీలు తమ ధార్మిక - ప్రాపంచిక నాయకుడిగా పరిగణించారు. ఫరాజీల స్థావరాలలో ఆయన మాట వేద వాక్కు. చివరకు ఆయన రాజ్యంలో తనదైన రాజ్యాన్ని నడిపారు, ("..The Farazis considered him to be their temporal as well as spiritual leader. With in the Farazi strongholds his word was law. He had virtually estab- lished a state with in the state.." Amar Jiban (in Begali) By Nabin Chandra Sen) అని పేర్కొన్నారు.
⁠ఈ విధంగా ఫరాజీల ఉద్యమాన్ని పటిష్టం చేస్తూ నొయా ముందుకు సాగారు. జమీందారుల, కంపెనీ ఆధికారులు అక్రమాలు, అన్యాయం ఎక్కడ జరిగిన అక్కడ ఫరాజీలు ఆయన మార్గదర్శకత్వంలో ప్రత్యక్షం కాసాగారు. 1869లో ధునియా మొన్నేహా పోలీసు ఠాణా పరిధిలోని టుర్నిహాట్ ప్రాంతంలో ఫరాజీలు ఆదాయపన్ను శాఖ ఆధికారి మీద దాడి చేసారు. ఆధికారి వద్ద వున్న గుమస్తా, ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించినందున ఆగ్రహించిన చేనేత పనివారు, చేపలు పట్టేవారు ఆధికారి మీద, పోలీసుల మీద దాడి జరిపారు. ఈ విషయమై జరిగిన విచారణలో ' గుమస్తా అతిగా వ్యవహరించడం వలన దాడి జరిగిందని, అకారణంగా ఫరాజీలు ఈ దాడులకు పాల్పడలేదని ' విచారణ సంఘం పేర్కొనటం గమనార్హం.
⁠అన్యాయం, అధర్మం, అక్రమం అణచివేతలకు వ్యతిరేకంగా మాత్రమే ఫరాజీలు దాడులను చేసారు. తిరుగుబాట్లు నిర్వహించారు. పోరాటాలు జరిపారు. న్యాయాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను గౌరవించారు. ఈ కారణంగానే ఫరాజీలు సాగించిన పలు పోరాటాలలో హిందువులు, క్రైస్తవులు కూడా వారితో భాగస్వాములయ్యారని ఫరాజీల పోరాటాల మీద న్యాయ విచారణలు జరిపిన ఆంగ్లేయాధికారుల సంఘాలు, న్యాయ స్థానాలు తమ నివేదికలో పేర్కొన్నాయి. ఈ విషయాలను ధృవీకరిస్తూ న్యాయస్థానాలలో ఫరాజీలు కానివారు, కంపెనీ పాలకులకు మద్దతుదార్లు కూడా సాక్ష్యం పలికారు. ఈ సంఘటనలు జరిగిన తరువాత ఫరాజీల ప్రాబల్యంగల ప్రాంతాలన్నింటిలో ఆయుధాల చట్టాలను అమలుచేసి, ఫరాజీల వద్దనున్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కంపెనీ పాలకులకు కలిగింది. ప్రజాబలం పుష్కలంగా గల ఫరాజీలను నిలువరించడం కంపెనీ పాలకులకు సాధ్యం కాలేదు. నిబద్ధత, నియమబద్ధ జీవితం, పటిష్టమైన పాలనా వ్యవస్థ, అంతకంటే పటిష్టమైన యంత్రాంగం కారణంగా రాజీలను పరాజితులను గావించటం కంపెనీ ఆధికారులకు దుస్సాధ్యమైంది.
చిత్తయిన పాలకుల ఎత్తులు
⁠ప్రజలలో క్రమంగా పెరుగుతున్న నోయా మియా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, పుంజుకుంటున్న ఫరాజీలను నిర్వీర్యం చేసేందుకు కంపెనీ పాలకులు, పాలకుల తొత్తులైన జమీందారులు, తమకు అలవాటైన విభజించు పాలించు సూత్రాన్ని ప్రయోగించటం ప్రారంభించారు. కుట్రలు, కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఆనాడు దూదు మియా మేనల్లుడు బనీ అమీర్ మియా (Bani Amir Miyan) ఫరాజీలలో బాగా పలుకుబడి సంపాదించుకొని బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన నాయకత్వంలో పలు ప్రాంతాలలో ఫరాజీలు