సయ్యద్ నశీర్ అహమ్మద్ 52
మాతృభూమిని విముక్తం చేసేందుకు మరణాన్ని ప్రేమగా అలింగనం చేసుకునేందుకు సిద్ధమైన
పీర్ అలీని చాంకీపురాలో 1857 జూలై 7వ తేదిన ఉరితీసారు.
సకల సంపదలను ధారపోసిన అమీరుద్దీన్
ఉత్తుంగ తరంగమై సాగుతున్న వహాబీ ఉద్యమాన్ని పటిష్టంచేయడానికి తన సకల
సంపదలతో పాటుగా ప్రాణాలను సైతం అర్పించిన యోధుడు అమీరుద్దీన్. పాట్నాకు
చెందిన సంపన్న కుటుంబంలో 1790లో జన్మించిన ఆయన భోగభాగ్యాలను త్యజించి
ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం వహాబీ నాయకుల
అరెస్టులు సాగించినప్పుడు అమీరుద్దీన్ ను కూడా అరెస్టు చేసింది. బ్రిటీష్ రాణికి వ్యతిరేకంగా
కుట్రపన్నారని, ప్రజలను రాణి పాలనకు వ్యతిరేకంగా రెచ్చకొట్టి రాజద్రోహానికి పాల్పడ్డారని
ఆరోపిస్తూ ప్రఖ్యాత 'మాల్దా విచారణ జరిపించింది. మూడు సంవత్సరాలపాటు సాగిన
ఈ విచారణలో అంతా ఊహించిన విధంగానే వహాబీ నేతలకు మరణ శిక్షలు, ద్వీపాంతరవాస
శిక్షలు, జీవిత శిక్షలు విధిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం తీర్పు చెప్పింది. అమీరుద్దీన్కు ద్వీపాంతరవాస
శిక్ష పడింది. ఈ శిక్షను ప్రకటించినంతనే ఆయన సంతోషం వ్యక్తంచేస్తూ, ' బ్రిటీష్ వ్యతిరేక
పోరాటంలో మరణం లభించినా సంతోషంగా స్వీకరించడానికి సిద్ధమని, ప్రకటించాడు.
ఆయన ఆస్తిపాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంట్లోని ' పర్దానషీ ' మహిళలను
కూడా వీధి పాట్టేసింది. అండమాన్ దీవులకు తరలించబడిన అమీరుద్దీన్ స్వతంత్ర భారతాన్ని
కలలుగంటూ పోర్టుబ్లెయిర్లో 1877లో మరణించారు.
చిత్రహింసలు సహించిన ముబారక్ అలీ
బ్రిటీష్ పోలీసులు చిత్రహింసలను చిరునవ్వుతో సహించి వహాబీ ఉద్యమానికి
శక్తివంతమైన నాయకత్వం అందించాడు ముబారక్ అలీ. ఆయన బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్
జిల్లా హాజిపూర్లో జన్మించాడు. ప్రముఖ వహాబీ నేత మౌల్వీ ఇనాయతుల్లా ప్రధాన
సహచరుడిగా ఉద్యమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆయన పాట్నా తరలి వెళ్ళారు.
పాట్నాలో మౌల్వీ అహమ్మదుల్లాతో కలిసి వహాబీ ఉద్యమాన్ని పటిష్టపర్చటంలో భాగస్వామి
అయ్యారు. ఉద్యమానికి అర్ధిక వనరులు సమీకరించే కమిటీకి ఆయన బాధ్యత వహించారు.
మౌల్వీ అహమ్మదుల్లా అరెస్టు తరువాత ఉద్యమ నాయకత్వాన్ని ఆయన చేపట్టారు. 1865
నాటి పాట్నా విచారణలో నాయకులందరికీ భయంకర శిక్షలు పడినా, ఏమాత్రం తొణకకుండా
విప్లవ పోరాట కార్యక్రమాలను రూపొందించి, మార్గదర్శకత్వం వహించి, అమలుచేసి పాలక
వర్గాలను హడలెత్తించారు. ఈ పోరాటాలను ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. ముబారక్
అలీని 1871 మార్చి మాసంలో ప్రభుత్వం నిర్బంధించగలిగింది. బ్రిటీష్ పోలీసులను
ముప్పుతిప్పలు పెట్టినందుకు కక్షకట్టిన పోలీసులు నిర్బంధంలో ఆయనను క్రూరంగా
హింసించారు. అమానవీయ పద్ధతులన్నీ ప్రయోగించారు. ఆమానుషంగా వ్యవహరించినా,
ఉద్యమకారుల రహస్యాలు బహిర్గతం చేయటంగానీ, తనబాట సరికాదని గానీ, ఆయనచేత
చెప్పించటం పోలీసులకు సాధ్యం కాలేదు. ఆయన శరీరంలోని అవయవాలన్నీ నుజ్జు నుజ్జు
అయిపోయాయి. పోలీసులు సాగించిన చిత్రహింస ఫలితంగా పెద్ద వయస్సులోనున్న ఆయన