Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 48

అంశాలను పరిశీలిస్తే ఆయన సమరశీలత బోధపడుతుంది. బ్రిటీష్ అధికారి, చరిత్రకారుడు, William Hunter ఆయన గురించి వ్యాఖ్యానిస్తూ," ...Who made no pretention to loyalty and sought nothing at our hands..." అన్నాడు.
⁠'‘...'ఈ విచారణకు కారణమైన భయంకర కుట్రకు యహ్యా అలీ ప్రధానం. ఆయన తన దేశస్థులను వందల వేల సంఖ్యలో రెచ్చకొట్టి కుట్రకు పురికొల్పాడు. కుతంత్రాలు పన్ని బ్రిటీష్ ఇండియా ప్రభుత్వాన్ని యుద్ధంలోకి దింపి వందలాది జీవితాలు అంతం' కావడానికి కారణమయ్యాడు. అతను ఉన్నత విద్యావంతుడు. అతను తనకేమి తెలియదని, అజ్ఞానాన్ని ప్రదర్శించి తప్పుకోడానికి వీలు లేదు. అతను చేసేదంతా దురాలోచనతో తెలిసి చేసిందే. అది భయంకర కుట్ర, రాజ ద్రోహమంటూ...బొద్దు పాఠ్యం'...' అంబాల విచారణలో పాల్గొన్న ఆంగ్లేయ న్యాయాధికారులు పేర్కొన్నారు. విచారణ తరువాత యహ్యా అలీకి మరణ దండన విధించారు. ఆయన మరణ శిక్షను ఆనందంగా ఆహ్వానించగా, మరణ శిక్ష విధిస్తే అమర వీరుడుగా ఆయనను కీర్తించటం జరుగుతుందని భావించిన బ్రిటీషర్లు దుర్బుద్ధితో ఆ ఖ్యాతి దక్కనివ్వరాదని, మరణ శిక్షను కాస్తా ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. (The Govt wished to deny the Wahabi leaders the chance of becoming martyrs. - A History of Freedom Movement in Bihar Vol. 1, page 88). అనంతరం మిగతా వహాబీ నేతల ఆస్తిపాస్తులను జప్తు చేసినట్టుగానే యహ్యా అలీ ఆస్తులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అన్న అహమ్మదుల్లా షా లాగే శిక్షను అనుభవిస్తూ ఆయన కంటే ముందుగా 40 ఏండ్ల వయస్సులో నూరేళ్ళ జీవితం ముగించి 1868లో యహ్యా అలీ ఆండమాన్ దీవులలో కన్నుమూసారు.
⁠ప్రసిద్ధి చెందిన ఆనాటి వహాబీ ఉద్యమ నిర్మాతల, పోరాట యోధుల ఆత్మబలిదానాలతో ప్రేరణ పొందిన వహాబీలు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి, చెరసాలలు, ఉరికొయ్యలు, తుపాకి గుళ్ళకు వెరవక బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులయ్యారు. అండమాన్ లోని భయంకర పోర్టుబ్లెయిర్ జైలుకు పంపబడిన ప్రప్రథమ భారతీయ విప్లవకారులుగా వహాబీలు ఖ్యాతిగాంచారు. ఈ మేరకు పలు త్యాగాలతో వహాబీల చరిత్రను సుసంపన్నం చేసిన నాయకులలో ఫయాజ్ అలీ, వాజిల్ హజ్, మస్కర్ అలీ, అబ్దుల్ రహీం, ఈరాదత్ హుస్సేన్, మహమ్మద్ ఇబ్రహీం అబ్దుల్లా, కరామత్ అలీ, అబ్దుల్ అజీజ్ రహమాబాద్, షేర్ అలీ, పీర్ అలీ, మహమ్మద్ జాఫర్, మహమ్మద్ షఫీ, ముబారక్ అలీ తదితరులున్నారు. ఈ నేతలే కాకుండా ఆనాడు సామాన్య వహాబీ కార్యకర్తలు కూడా అసమాన త్యాగాలతో పుడమి తల్లి రుణం తీర్చుకున్నారు. ఆ పౌరులందరి చరిత్రలు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న వహాబీ యోధులలో కొందరు.
పులి బిడ్డ మహమ్మద్ అబ్దుల్లా
⁠పులిబిడ్డగా ఖ్యాతిగాంచిన మహమ్మద్ అబ్దుల్లా పంజాబ్ రాష్ట్రం పెషావర్ లో జన్మించారు. వహాబీల పాఠశాలలో విద్యాభ్యాసం సాగింది. ఆ విద్యాసంస్థల నుండి బయటకు వచ్చిన యువతలాగే అబ్దుల్లా కూడా వహాబీ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అచిరకాలంలోనే నిబద్ధతగల వహాబీ కార్యకర్తగా రూపొందారు. వహాబీలను అణిచివేసేందుకు