సయ్యద్ నశీర్ అహమ్మద్ 112
మతం రంగు పులిమారు. మలబారులో 90 శాతం భూమి హిందూ జెన్మిల ఆధీనంలో
ఉండగా, ప్రజానీకంలో 70 శాతం మంది భూమిలేని నిరుపేద మోర్గాలు. రైతులు, రైతు
కూలీలలో అత్యధికులు ముస్లిం మోప్లాలు కావడం, భూస్వాములు హిందూ జెన్మిలవటం
వలన ఈ రెండు వర్గాల మధ్యన తలెత్తిన వివాదాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల నిమిత్తం
హిందూ-ముస్లింల సమస్యగా ప్రచారం కల్పించారు. ఆరుకాలాలు శ్రమపడినా అటు జెన్మిల
దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకాల్సిన దుర్భర పరిస్థితులలో, అటు జెన్మిల, ఇటు
మధ్య దళారీల దోపిడీని సహించలేక, ఓర్పు నశించిన మోప్లాలు తిరగబడి హింసకు
పాల్పడేసరికి, ముస్లింలు హిందువుల మీద దాడులు చేస్తున్నారని కంపెనీ పాలకులు ప్రచారం
చేశారు.
భూ సమస్య ఆధారంగా సాధారణ హిందూ ప్రజానీకం, మోప్లాలతో కలిసి
భూస్వాముల మీద తిరగబడకుండా చేసేందుకు ఈ వివాదాన్ని హిందూ- ముస్లింల వివాదంగా
జెన్మిలు చిత్రించి, సామాన్య హిందూ ప్రజానీకాన్ని తమ వెంటన పెట్టుకుని, మోప్లాలకు
వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. హిందూ జెన్మిల మీద జరిగిన హింసను హిందూ
సమాజం మీద ముస్లింలు సాగిస్తున్న హత్యాకాండగా చిత్రీకరించారు. ప్రతి సంఘటనను
ఏదో రకంగా మతం రంగు పులిమి తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు
ప్రయత్నించారు. భారతీయులు మతానికి, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు ఇచ్చే
ప్రాధాన్యతను గమనించిన బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తులు, ఈ రెండు వర్గాల మధ్యన జరిగిన
మర్షణలకు మతం రంగుపూసి, తమ దోపిడీని, అణచివేతను నిరాటంకంగా
కొనసాగించేందుకు కుయుక్తులు పన్నాయి. చివరకు 1920-21లో ఖిలాఫత్ -సహాయ
నిరాకరణ ఉద్యమాలతో ప్రేరణ పొందిన మోప్లాలు అటు జెన్మిల మీద ఇటు బ్రిటీష్
ప్రభుత్వం మీద సాగించిన పోరాటాలను కూడా మత కలహాలుగా చిత్రించాయి. ప్రముఖ
చరిత్రకారుడు Dr. Santimoy Ray తన Freedom Movement and Indian Muslims
గ్రంథంలో బ్రిటీషర్ల కుయుక్తిని ఎండగడ్తూ, "... To cover their diabolic design and
rebellion was branded as communal flare up..." అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ
పాలకులు పథకం ప్రకారంగా సాగించిన ఈ ప్రచారానికి లోనైన స్వదేశీయులు కూడా
మోప్లాల తిరుగుబాటును, హిందువుల మీద మోప్లాలు సాగించిన దమనకాండగా భావించారు.
భిన్నాభిప్రాయాలు
ఈ దుష్పరిణామాల వలన ఆత్మత్యాగాలతో ఒక శతాబ్దం పైగా అప్రతిహతంగా
సాగిన మలబారు మోప్లాల రైతాంగ పోరాటం, ఖిలాఫత్ -సహాయ నిరాకరణ ఉద్యమాలలో
మోప్లాల పాత్ర, అనుకూల ప్రతికూల విమర్శలతో, భిన్నాభిప్రాయాలతో, భారతదేశ
స్వాతంత్రోద్యమ చరిత్రలో వివాదాస్పదంగా మిగిలిపోయింది.
ఈ పోరాటంలోని ప్రధాన వైరి పక్షాలు మతం రీత్యా హిందువులు- ముస్లింలు
అయినప్పటికీ, వైరానికి మతం మాత్రమే కారణం కాలేదు. భూ సంబంధాలు రైతుల రగడ
రచ్చకెక్కడానికి మూలమైనాయి. ఈ వివాదాన్ని ... నిశితంగా పరిశీలిస్తే, ఈ నేరాలలో
80శాతం మోప్లాలు హిందూ జెన్మీలపైగాని, ఏజెంట్లపైగానీ, రెవిన్యూ అధికారులపైగానీ,