పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల ఆజ్ఞలను బాహటంగా ఉల్లంఫిుంచి నూతన పోరాట చరిత్రకు నాంది పలికారు.

ఔరంగాబాదులో గల నైజాం సైన్యంలోని కాల్బలం నిజాం రాజ్యం సరిహద్దు దాకా వెళ్ళి స్వదేశీ పాలకుల మీద దాడులు జరిపేందుకు పూర్తిగా నిరాకరిస్తూ, నిజాంకే సర్‌హద్‌ బాహర్‌ నహీ జాయేంగే-దీన్‌ కే ఊపర్‌ కమర్‌ నహీ బాందేగే అని స్పష్టంగా ప్రకటించారు. (' We will not cross the frontiers of the Nizam's dominions and we will not fight against our own co-religionists ' - Highlights of the Freedom Movement in Andhra Pradesh - Dr. Sarojini Regani, 1972, Page.8).

ఆనాడు ఉత్తరభారత దేశంలో పలు పరాజయాలను ఎదుర్కొంటున్న ఆంగ్లేయులు ఆ ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల మీద పోరాడడానికి తమను తరలిస్తారని స్వదేశీ సైనికాధికారులు, సిపాయీలు భావించారు. 1780 ప్రాంతంలో ఏవిధాంగానైతే హైదర్‌ అలీ మీద యుధం చేయడానికి సైనికుల తరలింపు కార్యక్రమాన్నిస్వదేశీ సైనికులు అడ్డగించారో అదేవిధంగా 1857 ప్రాంతంలో కూడా ఉత్తరాదికి వెళ్ళడానికి నిరాకరిస్తూ అధికారుల ఆజ్ఞలను స్వదేశీ సైనికులు నిరసించారు. ఆ నిరసన నుండి ఉద్భవించిన తిరుగుబాటుకు జమేదార్‌ అమీర్‌ ఖాన్‌, దాఫేదార్‌ మీర్‌ ఫిదా ఆలీలు నాయకత్వం వహించారు. ఆ సందర్భంగా ఫిదా అలీ మీద సైనికవిచారణ జరిపి ఆయనను ఉరి తీశారు, అమీర్‌ఖాన్‌ మాత్రం ఆంగ్ల సైన్యాలకు చిక్కకుండా తప్పించుకున్నారు.

కంపెనీ అధికారుల ఆజ్ఞలను తు.చ తప్పక పాటించే భారతీయ సైనికులు, సైన్యాధికారులు తిరుగుబాటును ప్రకించడం, ఆంగ్లేయాధికారులతో సరాసరి తలపడడాన్ని ఏమాత్రం సహించని ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటుకు ఉద్యుక్తులైన ప్రతి ఒక్కరి మీదాకఠిన చర్యలు తీసుకున్నారు.

భయానక శిక్షలకు భయపడని యోధులు

బ్రిటిషర్ల ఆజ్ఞలను ధిక్కరించిన స్వదేశీ సైనికులను, సైన్యాధికారులను ఉద్యోగాల నుండి తొలగించారు. పలువురికి కఠిన శిక్షలు విధించారు. ఉరిశిక్షలు, ఫిరంగులకు కట్టి పేల్చివేయడం ఆనాడు అతి సాధారణ విషయమైంది. ప్రభుత్వం ఎంతి కిరాతకత్వానికి పాల్పడినా తిరగబడ్డ యోధులు మాత్రం శిక్షలకు ఏ మాత్రం వెరవలేదు, భయకంపితులు కాలేదు. ఆ వీరయోధులు మరణశిక్షలను కూడా ప్రశాంతంగా స్వీకరించి ఆంగ్లేయాధికారులను సైతం ఆశ్యర్యచకితుల్ని చేశారు. ఆ మారణకాండకు సంబంధించిన భయానక దృశ్యాలను బ్రిటిష్‌ అధికారులు కూడ స్వయంగా చూడలేకపోయారు.

29