పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశకుల విజ్ఞప్తి

సహృదయులారా!
ఆంధ్రవాఙ్మయమునఁ బేరెన్నికగన్న శతకములను విషయములనుబట్టి విభాగములు గావించి సంపుటములుగఁ బ్రచురింపఁ దలంచి యనేకశతకములను ముద్రితాముద్రితముల నార్జించి శుద్ధప్రతులు పీఠికలు వ్రాయించి సిద్ధపఱచితిమి. శ్రీయుత గురుజాడ అప్పారావుగారిద్వారా మాయుద్యమమును విని శ్రీవిజయనగర సంస్థానధీశ్వరులగు మీర్జా శ్రీరాజా శ్రీపూసపాటి విజయరామగజపతి మహారాజా మన్నెసుల్తాన్ బహదర్ వారు కాగితములవ్యయము భరించి శతకసంపుటముల ప్రచురణమునకుఁ దోడుపడుదుమని వాగ్ధాన మొనరించి మమ్ము సర్వవిధములఁ బ్రోత్సహించి మాయుద్యమముపై సానుభూతిఁ జూపిరి.

కాని, శతకకవులచరిత్రము వ్రాయుచు శ్రీ వంగూరు సుబ్బారావుగారు మాయొద్దనుండి శతకప్ర