పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

480

ఇందలి శైలి మిగుల మృదుమధురముగా నుంటచే నిందుఁ బ్రతిపాదింపఁబడిన బశ్చాత్తాపవిషయములు పిండోత్పత్తివిధము పంచీకరణము ముద్రాదికములు యోగములు సామాన్యజనములకు సైతము సుబోధముగా నున్నది.

ఈ శతకమున నారాయణశతకమునఁ జెప్పఁబడనియంశములు పెక్కులు సాంఖ్యశాస్త్రము ననుసరించి కవి తెలిపెను. తోఁట వేంకటనరసింహకవి యితర గ్రంథములు కానరావు. ఉత్తమోత్తమమగు నీశతకరాజమును పఠించి యాంధ్రులు పరమార్థము నొందుదురేని శతకకర్త సిద్ధసంకల్పుఁడగును.

ఇట్లు
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్