భారతదేశ స్వాతంత్ర్య విప్లవము
319
చూచుచుండగనే భారతదేశమున చాలభాగమును బ్రిటిషు ఇండియాగా జేసివైచిన డల్‌హౌసీ ప్రభువు ప్రయోగించిన రాజ్యతంత్రము అద్వితీయమైనది. 1857లో స్వాతంత్ర్య సమరము రానిచో భారతదేశ పటమంతయు అరుణముగా జిత్రింపబడి యుండెడిదే. పీష్వాబాజీరావు ప్రభుత్వమువారి యనుమతితో నానాసాహేబును దత్తుచేసుకొనెను. అతడు చనిపోవుటకు ముందు తనకిచ్చు 8 లక్షల పింఛనును తన పీష్వా పదవిని తన పుత్రున కివ్వవలసివదని కంపెనీవారికి అర్జీ పెట్టుకోగా పీష్వాబిరుదు నిచ్చుటకు వీలులేదని చెప్పి పింఛనుసంగతి తరువాత ఆలోచింపబడుననిరి. బాజీరావు 1851 లో చనిపోగా డల్‌హౌసీ ఆ ఫించను తీసివేసెను. బాజీరావుపైన ఆధారపడిన ఆశేషజనులకు జీవనాధారము లేకపోయెను. గవర్నరు జనరలు తీర్మానముపైన నానాసాహెబు కంపెనీ డైగెక్టర్ల కోర్టువారికి అప్పీళ్లు దాఖలుచేసికొనెను. అచ్చట తన పక్షమున పనిచేయుట కొరకు తన కొలువులో నుండిన విద్యావంతుడు రాజ్యనీతి విశారదుడు నగు అజీముల్లాఖాన్ అను నొకమహమ్మదీయ యువకుని నానాసాహెబు ఇంగ్లాండుకుపంపెను. ఈ రాయబారి ఇంగ్లాండు చేరులోపలనే 1853 లో కంపెనీ డైరక్టర్లు నానాసాహెబు అప్పీలుత్రోసివేసిరి.
అజీముల్లాఖాను చాలా తెలివైనవాడు. ఇతడు కామన్సు సభాసమావేశములకుగూడ బోవుచు తన యజమానికి జరిగిన అన్యాయములను మాన్చుట యెట్లని యోజించుచు అతడిచ్చిన సొమ్ముతో కొన్నాళ్లు ఇంగ్లాండులోనే యుండెను. ఇంతలో