పుట:బేతాళపంచవింశతి.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భస్మశయనుఁ డింతి పతి నిజంబు.

100


వ.

అనిన నదృశ్యుండై భేతాళుండు వృక్షంబునకుం బాఱిన బట్టుకొని
వచ్చునెడ వాఁడు వెండియు ని ట్లనియె.

101

3 కథ

గీ.

అనఘ విక్రమకేసరి యనఁగఁ గలఁడు
రాజు పాలివివృత్తపురంబునందు
సతతలక్ష్మీశుఁ డాతని సుతుఁడు ఘనప
రాక్రముం డఖిలలోకనిరతయశుండు.

102


క.

ఆ రాజకుమారునకును
కీరము గల దొకటి యది యఖిలశాస్త్రములన్
భూరికళాసంచయమునఁ
బారీణతఁ దాల్చి యొప్పు బహుజననుతమై.

103


వ.

మఱియుం గాంతాప్రసాదసేవాయత్నంబులం దత్కథావిదులయిన
మానవులకంటె వివేకంబు గలిగి యతతానాగతపరిజ్ఞానంబున వి
ద్వజ్జనులకంటె భూమియందుఁ బొగడ్త కెక్కి నిజపక్షకాంతిపటంబు
నం జేసి తనయున్నకనకపంజరంబునుంబోలె నొప్పుచుండ సకల
జనసేవ్యంబై యుండు నచ్చిలుక యేమి చెప్పిన నిజం బని యుపలా
లించుచు నొక్కనాఁడు రాజకుమారుండు దాని కి ట్లనియె.

104


క.

నీవు సమస్తము నెఱుఁగుదు
నా విమలత నిన్ను నొకటి యడిగెదఁ జెపుమా