పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతజ్ఞతలు

ఈ కథను అంతనూ, కనుమరుగవుతున్న సమయంలో పైకిలాగి, ధారావాహికంగా 'ఆంధ్రజ్యోతి వారపత్రిక'లో ప్రచురించి, నేటి తరం యువ హృదయాలను ఆనంద భరితం చేయబూనిన ఉదారులూ, సహృదయులూ, రసజ్ఞులూ, బహు గ్రంథకర్తలూ, విశేషించి నా కాప్తమిత్రులూ, అయిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియకుండా ఉన్నది. వారూహించుకో గలరు. దీనికి ప్రాణం పోసినట్లు చిత్ర రచన చేసిన శ్రీ బాబు గారికి కూడా నా కృతజ్ఞతలు

ముఖచిత్రం ముచ్చటగా రూపొందించిన సుప్రసిద్ధ చిత్రకారులు శ్రీ బాపు గారికి మరీ కృతజ్ఞుడను

పుస్తకం రెండు మూడు భాగములు వ్రాయడానికి, నా కుడిచేయిగా వ్యవహరించిన చిరంజీవులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మకు, కుమారి కప్పగంతుల రాజరాజేశ్వరికి అనేక ఆశీస్సులు


- - మొక్కపాటి నరసింహశాస్త్రి