పుట:ప్రబోధచంద్రోదయము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విస్రగంధాలయాజస్రపరిస్రవ
                          బహుతరప్రస్రావవల్వలంబు


గీ.

నైన భవదీయమందిరప్రాంగణమున
కెట్టు దివిచెదు యోగ్యులై నట్టిఘనుల
భృంగమౌర్వినినాదకంపితసమస్త
పటువియోగిజనప్రాణ! పంచబాణ![1]

10


క.

అని పలికి మిన్ను చూచుచు
మనసిజునిం గూర్చి యోరిమాలా! యీలా
గున బ్రమయించెద వేలా
జనులు నిరాలంబనమున జనితుఁడ వయ్యున్.

11


మ.

ననుఁ గామించిన దీలతాంగి నను నానందంబుగాఁ జూచి యి
వ్వనజాతానన కౌగిలించె నను నివ్వాహమాక్షి కాంక్షించె నం
చు నరుల్ భ్రాంతి వహింతు రేల పిశితాస్థుల్ కూడి రూపైన మో
హినియే కార్యము కానరాని పురుషుం డీక్షింపఁ గాంక్షింపఁగన్.

12


క.

అనుచు న్వస్తువిచారుఁడు
చనుదెంచి వివేకనృపతి చరణంబులకున్
వినతుండై తచ్చాసన
మునఁ జేరువజమ్ముఖాణమునఁ గూర్చుండన్.

13


మ.

అతనిం జూచి వివేకుఁ డిట్లను మహాత్మా! మాకు సమ్మోహునిం
బ్రతిపక్షు న్విదళింపఁగావలయు సంగ్రామంబున న్వానికిన్
హితుడు న్వీరుడునైనకామునకు నిన్నే యెంచుకొన్నాఁడ నేఁ
బ్రతిగా నాయుధవిద్య నీకుఁ గలదా భంజింపఁ దత్కామునిన్.

14


క.

అనవుడు వస్తువిచారుఁడు
జననాథా! వాని కైదుశరము లవియు నం

  1. ఇది యొకప్రతిలోనే యున్నది. ప్రక్షిప్త మని తోఁచుచున్నది.