Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రౌఢకవి మల్లయ రుక్మాంగదచరిత [3-6]

సీ.

పసిఁడిపువ్వులు పట్టుపచ్చడంబులు రేఖ
              చీరలు గుజ్జరిపారువములు
చమురుకావళ్ళు రాజనపుబియ్యమ్ములు
              చెఱుకుఁగోలలు కందచిరుగడములు
మినుములు పెసలు మామిడితాండ్ర టెంకాయ
              యల్లంబు తమలంపుటాకుఁ గట్లు
[1]మేకపోఁతులు పండుమీను తట్టంబులు
              ఖర్జూరములు తేనె కలపు పైర్లు


తే.

[2]దోని మెకములు పందులు దుప్పి తొడలు
పనసపండ్లును బెల్లంబు పంచదార
గసగసలు సారపప్పు ద్రాక్షఫలములును
గొనుచుఁ బ్రజ లేఁగి రవనీశు కొలువునకును.

47

బమ్మెర పోతరాజు – నవమస్కంధము [333]

సీ.

[3]కలఁగు టెల్లను మానెఁ [4]గంధు లేడింటికిఁ
              జలనంబు మానె భూచక్రమునకు
జాగరూకత మానె జలజలోచనునకు
              దీనభావము మానె దిక్పతులకు
మాసియుండుట మానె మార్తాండ[5]విధులకుఁ
              గావిరి మానె దిగ్గగనములకు
[6]నుడిగిపోవుట మానె నుర్వీరుహంబుల
              కడఁగుట మానె ద్రేతాగ్నులకును


ఆ.

గడిఁది వ్రేఁగు మానెఁ గరిగిరికిటినాగ
కమఠములకుఁ బ్రజల కలఁక మానె
రామచంద్రవిభుఁడు రాజేంద్రరత్నంబు
ధరణిభరణరేఖఁ దాల్చు తఱిని.

48

[335]

సీ.

పొలతుల వాలుచూపులయంద చాంచల్య
              మబలల నడుములయంద లేమి
కాంతాలకములంద కౌటిల్యసంచార

  1. గ.దంతపుఁబ్రతిమలు దానిమ్మఫలములు
  2. గ.దోమతెఱమంచములు నంపదొనలు విండ్లు
  3. క.కలిగియుండుట
  4. క.కందు లేదేటికి
  5. క.బింబంబు
  6. క.నుడుగు