Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత [1-47]

ఉ.

వాడల వాడలం దిరుగు వారవధూటుల వక్రపద్మసం
క్రీడదనూనవాసనకుం గేలిసరోవరఫుల్లహల్లక
క్రోడసుగంధిగంధములకుం గలహంబులు చక్కఁబెట్టి చె
ర్లాడఁగఁజేయు సజ్జనుక్రియన్ మలయాచలవాతపోతముల్.

268

సర్వదేవుఁడు - ఆదిపురాణము[1]

చ.

మరువముఁ బొంది పొంది విరిమల్లియపువ్వులఁ జెంది చెంది కే
సరములఁ గ్రాలి క్రాలి జలజాతపరాగముఁ దోలి తోలి క
ప్పురమున నేచి యేచి సురపొన్నల వాసన మోచి మోచి తె
మ్మెరలు నిరంతరంబును భ్రమించుచునుండు వనాంతరంబునన్.

269

గజవర్ణన

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

సీ.

మించిన గతులు సాధించి యింద్రునికి మా
              ర్కొనియున్న కాల్గల కొండ లనఁగఁ
జేతనత్వంబులు చేకొని రవికిఁ గొ
              మ్ములు చూపు చీఁకటి మొన లనంగఁ
జేకల్గి యలుల కనేకదానము లిడ
              మెలఁగు తమాలభూమిజము లనఁగఁ
జిత్ర[2]వధాధుర్యసిద్ధులై గాడ్పుతో
              మోహరించిన కారుమొగుళు లనఁగఁ


తే.

నెల్ల చందంబులను గడు నెసకమెసఁగి
పొగడు సెగడును బడసి యప్పురిఁ జరించుఁ
దమ్ముఁజూచిన మెఱయుఁ బుణ్యమ్ము నొసఁగ
దావలంబైన భద్రదంతావళములు.

270

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

సీ.

మదభిన్నకటగళన్మౌక్తికంబులు తొట
              తొట రాల మస్తవిధూననముల
నానమత్కుతలంబులగు పదక్రమముల
              ఘణఘణంకృతి నాభిఘంట లులియఁ
గీర్తిచంద్రికల యాకృతి దట్టమై ధళ
              ధళఁ బర్వ దంతకుంతముల రుచులు

  1. ట.లో పద్యము లేదు.
  2. ట.కుధాస్తరాస్తీర్ణులై (?)