Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దుగ్ధపాథోరాశి తొలిచూలి సంతతి
              రోహిణీదేవి తారుణ్యఫలము


తే.

చంద్రకాంతశిలామణిస్థలకృపీట
నిర్థరాంధోవ్యధామోక్షనియమవైద్యుఁ
డంధకారచ్ఛటాహాలహలహరుండు
చంద్రుఁ డొప్పారెఁ గాంతి నిస్తంద్రుఁ డగుచు.

199

[1]తంజావూరిప్రతిలోని – కానుకొల్లు అన్నమరాజు అమరుకము, పణిదపు మాధవుని ప్రద్యుమ్నవిజయము, తులసి బసవయ్య సావిత్రికథ, లక్కాభట్టు శతపక్షిసంవాదము, పెదపాటి సోమయ అరుణాచలపురాణము, కేదారఖండము, చిమ్మపూడి అమరేశ్వరుని విక్రమసేనము, భావన పెమ్మన అనిరుద్ధచరిత్ర, నంది మల్లయ మదనసేనము, పొన్నాడ పెద్దిరాజు ప్రద్యుమ్నచరిత్ర, బొడ్డపాటి పేరయ శంకరవిజయము (రాజశేఖరవిజయము), తెనాలి రామలింగయ్య హరిలీలావిలాసము, కందర్పకేళీవిలాసము, నండూరి మల్లయ హరిదత్తోపాఖ్యానము, ఘటవాసి మల్లుభట్టు జలపాలిమాహాత్మ్యము, అంగద బసవయ ఇందుమతీకల్యాణము, అముడూరి నరసింగభట్టు షోడశరాజచరిత్ర, జయతరాజు ముమ్మన విష్ణుకథానిధానము, అజ్ఞాతకవి కళావిలాసము అను గ్రంథములనుండి అప్రకటితపూర్వములైన అనేకపద్యములు ప్రత్యంతరమునందు కలవు. అంతేకాదు. తంజావూరు ప్రతిలో లేని నారాయణదేవుని మదనకళాభిరామము, త్రిపురారి ప్రేమాభిరామము, పెదపాటి సోమరాజు రత్నావళి, అజ్ఞాతకవి నిజలింగచిక్కనికథ, నాచన సోమరాజు మత్తలీలావిలాసము, అజ్ఞాతకవి వెంకటవిలాసము, ప్రెగడపల్లి పోతరాజు గోదావరీశతకము, శరభాంకుని శరభాంకలింగశతకము అను గ్రంథములనుండి కూడ అనేక పద్యములు ప్రత్యంతరమునందు కలవు.

ఆంధ్పవిశ్వకళాపరిషత్ — గ్రంథాలయములోని తంజావూరుప్రతి నకలు కాగితపుప్రతికి, ప్రత్యంతరము కాగితపుప్రతికి మఱొకప్రతిని వ్రాసి, వానిని సంప్రదించునెడ చదువుటో, సరిజూచుటో చేసి, చిత్తుప్రతికి మఱల శుద్ధప్రతిని వ్రాసి సహకరించిన డాక్టర్ మోడేకుర్తి వెంకటసత్యనారాయణగారికి—

ముద్రణదోషములను సవరించునెడ సహకరించిన ఆచార్య కోలవెన్ను మలయవాసిని, డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, డాక్టర్ సజ్జా మోహనరావులకు—

ముద్రణకార్యమును నిర్వహించిన ఆంధ్రాయూనివర్సిటీప్రెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి. వి. కృష్ణారావుగారికి, వారిసిబ్బందికి—

ముద్రణభారమును వహించిన ఆంధ్రవిశ్వకళాపరిషత్ అధిపతులకు—

కృతజ్ఞతలు.

18-12-91

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి

  1. క. తంజావూరిప్రతి నకలు కాగితపుప్రతి
    చ. నాయొద్దనున్న ప్రత్యంతరము కాగితపుప్రతి
    ట. ప్రబంధరత్నావళి
    త. ప్రబంధమణిభూషణము
    గ. ముద్రితగ్రంథము