|
చంద్రబింబాస్యలై చాల రాగిల్లియు
నలకాంధకారంబు వెలయఁజేసి
పికనాదకంఠలై పెంపు వహించియు
నధరపల్లవముల ననునయించి
కలహంసగమనలై కడు బెడఁగారియుఁ
గరమృణాలంబులఁ గరము మనిచి
|
|
తే. |
నవ్యకౌముదీస్మిత లయ్యు నయనపాద
సారసంబుల నెంతయు గారవించి
చిత్రసౌందర్యధుర్యలై చిగురుఁబోఁడు
లప్పురిఁ దనర్తు రెక్కుడు నొప్పిదముల.
| 227
|
[1]పణిదవు మాధవుడు - ప్రద్యుమ్నవిజయము
సీ. |
గబ్బిబేడిసమీలు కన్నుల కెనవచ్చుఁ
బలుమాఱు నవి మిట్టిపడకయున్నఁ
దొగలనెచ్చెలికాఁడు మొగమున కెనవచ్చు
నొక యింత [2]మెరకందు నుండకున్నఁ
[3]గ్రొవ్విన జక్కవల్ కుచముల కెనవచ్చు
ప్రొద్దువోయినఁ బాసిపోకయున్న
[4]మెఱుఁగులు మెత్తనిమేనుల కెనవచ్చుఁ
దళతళఁ బొడకట్టి తలఁగకున్న
|
|
తే. |
ననుచు సరసులు వర్ణింప నవయవాతి
విభ్రమవిలాసవిస్ఫూర్తి వినుతికెక్కి
గణన మీఱిన మానినీమణులు గలరు
బొగడఁబెట్టిన ద్వారకానగరమునను.
| 228
|
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
బింబంబు హిమధామబింబంబు నణఁగించు
మధురాధరాననమండలములు
మించులఁ బసిఁడిక్రొమ్మించులఁ దలపించు
నతిమనోహరకటాక్షాంగరుచులు
నగములఁ గృష్ణపన్నగముల నగుఁ గుచ
ద్వితయరోమావళీవిభ్రమములు
తమ్ములఁ దేటమొత్తమ్ముల నిరసించు
నంఘ్రిద్వయీవినీలాలకములు
|
|
- ↑ ఫణదవు
- ↑ ట.మేనఁ గందుండకున్న
- ↑ ట.గ్రొవ్వున
- ↑ ట.పంక్తి లేదు.