Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శూద్రులు

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరితము

క.

ద్విజశుశ్రూషాపరవశు
లజనితపరివాదు లభినవాకృతులు మహా
సుజనచరిత్రులు ధీరులు
భుజవిక్రమధనులు ఘనులు పురి శూద్రజనుల్.

203

ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదము [1-70]

క.

అద్రులు ధైర్యంబున బల
భద్రులు భుజశక్తిసహితభంజనమున సౌ
భద్రులు తత్పురమునఁ గల
శూద్రులు [1]శూద్రకసమానశోభితవర్యుల్.

204

తెనాలి రామలింగయ్య - హరిలీలావిలాసము

ఉ.

ఆ కఱివేల్పుసామి చరణాబ్జములన్ జనియించినారు మం
దాకిని తోడునీడ లయినారు నిజంబుగఁ గమ్మ [2]గట్టు దా
మై కమనీయకీర్తిమహిమాతిశయంబున మించినారు భ
ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రులు మాద్రులు శూద్రు లప్పురిన్.

205

పెదపాటి సోమయ - అరుణాచలపురాణము

ఉ.

బంటుతనంబు వైభవము భాగ్యము తేజము చాలఁ గల్గి ము
క్కంటిని దమ్మికంటి నధికంబగు భక్తి భజించి కేలిమైఁ
గంటకులన్ జయించి కలకాలము నర్థుల కోర్కిపంటలై
పంటలు బాడియున్ గలిగి పంటలు మీఱుదు రప్పురంబునన్.

206

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

ఆ.

రత్నగర్భగర్భరత్నంబు లవ్వీట
నర్థిఁ బుట్టుచుఁ గొనియాడ మరగి
వీథి వీథి నెపుడు విలసిల్లు నా నాప
ణముల వివిధరత్నసమితి వెలుఁగు.

207

నన్నయభట్టు - ఆదిపర్వము [1-8-73]

చ.

వననిధిలోని రత్నములు వాసుకిమూర్ధజరత్నసంఘముల్
గొనఁగ నవశ్యముం జనులకున్ సమకూరదు గాన నెప్పుడున్

  1. క.శుక్రిక
  2. ట.కట్టి