Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


              యాక్షణంబున నీని [1]యార్యవరుఁడు
మహనీయకౌస్తుభమాణిక్యమునకైన
              వెలఁ ద్రెంచనేరని విడ్వరుండు
గురుతరహాటకకోటికిఁ బడగలు
              కోటి యెత్తని వణిక్కుంజరుండు


తే.

మందునకునైన లేరు సమగ్రభోగ
భాగ్యసంక్రందనులు జగత్ప్రకటకీర్తు
లర్థిసంపత్ప్ర[2]దుల్ నిర్జితార్థపతులు
వర్ణితోదారు లప్పురి వైశ్యు లెల్ల.

192

జక్కన – సాహసాంకము [1-73]

చ.

పరుసని భూతివ్రాఁతయును బన్నగభూషణు పున్క కోరయున్
గరివరచర్మముం దొఱగి గ్రక్కున లేమికి బొమ్మఁ బెట్టఁడే
హరుఁడు కుబేరుచే వెడలి యాదట మా సఖుఁడైన నంచు న
ప్పురమున వైశ్యు లాడుదురు పుణ్యము పేర్మిఁ బ్రతాపధాములై.

193

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

మ.

బహువస్తుక్రయవిక్రయక్రియలు సంపత్ప్రాప్తికై కాకయు
న్విహితాచారములైన చందములు వర్ణింపంగ నింతింత నా
మహిలో రాదని చెప్పనొప్పుదురు ధీమంతుల్ కుబేరార్చనన్
మహిమోదాహరణంబు లప్పురము కోమట్లెల్ల లక్ష్మీస్థితిన్.

194

ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదచరిత [1-69]

క.

మేటి ధనధాన్యసంపదఁ
గోటులకును బడగ లెత్తికొన నమ్మంగా
ఘోటుకగజరత్నాంబర
[3]కోటల గల వైశ్యు [లచటఁ] గోటుల తరముల్.

195

బమ్మెర పోతరాజు – దశమము [10-1-1605]

క.

రత్నాకరమై జలనిధి
రత్నము లీ నేర దేటి రత్నాకరమో
రత్నములఁ గొనుదు రిత్తురు
రత్నాకరజయులు వైశ్యరత్నములు పురిన్.

196
  1. ట.యర్య
  2. క.చా
  3. క.కోటులు