Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏర్చూరి సింగరాజు - కువలయాశ్వచరిత

శా.

ఆదిబ్రహ్మముఖాళి చాలక విహారార్థప్రయత్నంబుతో
వేదంబుల్ భువి ధర్మపోషణకు నై విఖ్యాతిగాఁ బుట్టెనో
కాదే నిట్టిమహత్త్వ మన్యులయెడన్ గానంబ నాఁ బొల్తు రా
భూదేవోత్తము లప్పురంబున మహాపుణ్యప్రభావంబులన్.

183

ప్రధానులు

బాలకాండ [1-26]

ఉ.

దానులు రాజ్యవర్ధనులు తత్త్వవిచారు లుదారు లింగిత
జ్ఞానులు మంత్రకోవిదులు సత్యవచస్కులు విద్విషత్తమో
భానులు ధీయుతుల్ చతురుపాయసమర్థులు రాజకార్యసం
ధానపరాయణుల్ వినయతత్పరు లాదిప్రధాను లప్పురిన్.

184

క్షత్రియులు

కవికర్ణరసాయనము [1-10]

శా.

పౌనఃపున్యముచేతఁ గాని రిపులం భంజింపలేఁడయ్యె భూ
దానం బొక్కెడఁ గాని షోడశమహాదానంబులం జేయఁ డిం
కే నీతిన్ జమదగ్నిరాముఁడు సముం డిద్ధప్రసిద్ధోన్నమ
ద్దానక్షాత్త్రగుణంబులం బురవరాంతక్షత్త్రియశ్రేణికిన్.

185

తెనాలి రామలింగయ - హరిలీలావిలాసము

ఉ.

ఏటి మహానుభావుఁ డిహిహీ జమదగ్నితనూజుఁ డేడు ము
మ్మాటులఁ గాని శత్రుమదమర్దనదక్షుఁడు గాఁడు గోత్రమే
తూఁటుగఁ [1]జేసి తల్లిమెడఁ ద్రుంచెగదా యని యీసడింతురౌ
గాటపుపంతగాండ్రు కులగణ్యులు [2]క్షత్రియరాజు లప్పురిన్.

186

పెద్దపాటి సోమయ్యగారు - అరుణాచలపురాణము

ఉ.

రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే
రాజులు రూపరేఖ రతిరాజులు మానగుణంబునందు రా
రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా
రాజు లనంగ నొప్పుదురు రాజితతేజులు తత్పురంబునన్.

187

పొన్నాడ పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

శా.

అవ్యాయామపురారు లక్షుభితపారావారు లక్షీణపు
ణ్యవ్యాపారసురేంద్రు లగ్రహణచంద్రాదిత్యు లస్థావర

  1. ట.జేత
  2. అగణ్యులు పుణ్యు లప్పురిన్