Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమన — ?, దశావతారము

నండూరి మల్లయ — హరిదత్తోపాఖ్యానము

నంది మల్లయ — మదనసేనము

మద్దికాయల మల్లయ — రేవతీపరిణయము

ఘటకాశి(మదిరాసి) మల్లుభట్టు — జలపాలిమాహాత్మ్యము

పణదపు మాధవుడు — ప్రద్యుమ్నవిజయము

నెల్లూరి ముత్తరాజు — పద్మావతీకల్యాణము

జయతరాజు ముమ్మయ — విష్ణుకథానిధానము

రంగనాథుడు — ?

వాసిరాజు రామయ్య — బృహన్నారదీయము

ఎలపర్తి రామరాజు — రామలింగశతకము

ఉభయకవి లక్కాభట్టు — శతపక్షిసంవాదము

సర్వదేవుడు — ఆదిపురాణము

సర్వన — షష్ఠస్కంధము

కంచిరాజు సూరయ — కన్నప్పచరిత్ర

దామరాజు సోమయ్య — భరతము

నాచిరాజు సోమయ్య — మత్త(ద?)లీలావిలాసము

పెదపాటి సోమరాజు — శివజ్ఞానదీపిక, కేదారఖండము, అరుణాచలపురాణము, రత్నావళి

పాలపర్తి సోమేశ్వరుడు — ?

? — కళావిలాసము

? — కామందకము

? — చాటువులు

? — నిజలింగచిక్కనికథ

? — నీతిసారము

? — పంచతంత్రి

? — పురుషార్థసారము

? — వెంకటవిలాసము

ఇవి గాక ఆకరములు లేని పద్యములు కవుల గ్రంథములును ఇంకను కలవు. సుమారు శతాధికగ్రంథములనుండి సహస్రాధికపద్యములను సంఘటించిన సంకలనగ్రంథము పెదపాటి జగన్నాథకవి ప్రబంధరత్నాకరము.

ఇందలి “భీమకవి - దశావతారము” పద్యము (1-33) సరిగా లేదు. అది “ఉదాహరణపద్యములు” అను సంకలనగ్రంథమున ఇటు కలదు.

సీ.

శ్రుతిసుధాక్ష్మాభక్తసురజననీవధూ
              మల్లశంకరధర్మమహితబుద్ధి
కగకూర్మకిటినరమృగకుబ్జరామరా
              మానంతబౌద్ధకల్క్యాహ్వయముల
నముచిమందరకుదానవబలార్జునపంక్తి
              ముఖముష్టికస్థివిముక్తఖలులఁ
పుచ్ఛాగ్రపృష్ఠవిస్ఫురదంష్ట్రనఖగుణ
              పరశుబాణకరాంగఖురపుటములఁ