తే. |
భూమికాంచితన్వమణిస్తోమధామ
మండలాఖండలాచ్ఛకోదండఖండ
పటలవర్తితదేహళీబర్హికులము
లగుచు నప్పురి సౌధంబు లతిశయిల్లె.
| 148
|
పోతరాజు భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [4-258]
సీ. |
తెరల వ్రాసిన [1]వ్రాఁత దీపించు పులులకు
మది లోఁగుఁ జందురుమచ్చ యిఱ్ఱి
తూలాడు పడగలతుదల తాఁకున [2]నుల్కి
రవితేరిహరు లుప్పరమ్ము దాటుఁ
[3]గేళాకుళులలోని కెందమ్మితూఁడులు
వింతగా నజు నెక్కిరింత [4]నంజు
రమణఁ బెంచిన మయూరంబులు వేలుపుఁ
గన్నెలతోఁ దాళగతుల నాడు
|
|
తే. |
ననిన నందులఁ దమిఁ జెప్ప నరుదులైన
సవడి గ్రహరాజు మేడల సవరణలను
మేటి పొడవులు నిట్టిట్టి పాటి వనుచు
జగములోపల మఱి వేఱె పొగడనేల.
| 149
|
సీ. |
తళతళమను పతాకలతోడ రవికాంతి
దలతలమనెడి రత్నములతోడఁ
గనఁగన సొబ గధికంబైన పొడవుతో
గనకనమను హేమకాంతితోడఁ
గలకలఁ బల్కు చిల్కలతోడ గృహదీర్ఘి
కలఁ గలహంససంఘములతోడఁ
బరిపరి గతినాడు బర్హులతో నిజో
పరిపరిగతి మేఘపంక్తితోడఁ
|
|
తే. |
దముల విహరించుఁ బారావతములతోడ
భ్రమదళివ్రాతసుమవితానములతోడఁ
బ్రమదవనవాసనలచేతఁ బ్రమద మొసఁగి
యెనయు నీమేడతోఁ బ్రతి యెనయఁ గలదె.
| 150
|
- ↑ క.ఘాత
- ↑ క.కన్కి
- ↑ క.కేతాకులుల
- ↑ క.నములు