|
తికిఁ జదలేటినీటికిఁ దుది న్నిటువంటిది యారవల్ గణిం
చుకొనిఁ జొచ్చు టెట్టులు విశుద్ధులె శ్రీశరభాంకలింగమా.
| 167
|
కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము
చ. |
అలఘుతరాపవర్గము సమంచితశంకరతీర్థరాశిలో
పల నధికంబు కాశి యదిప్రాణులఁ జంపక యీదు ముక్తి యే
యలజడిఁ బెట్ట కిచ్చు నరుణాచల మించుక యాత్మ[లోపలన్]
దలఁచిన మోక్షలక్ష్మి యిఁక దానికి సాటి[యె య]న్యతీర్థముల్.
| 168
|
వ్రతమాహాత్మ్యము
భైరవుఁడు – శ్రీరంగమహత్త్వము [5-103]
సీ. |
పటుఘోరపాతకపటలమ[హారణ్య]
చటులసమజ్జ్వలజ్వలనకీల
దుర్వారదారు[ణదుష్కృత]సంఘాత
మేఘసంవర్తసమీరణంబు
[భూరి]భీషణపాపపుంజసముత్తుంగ
భూమిభృ[న్నిశితదం]భోళిధార
దుస్సహదురితసందోహనిరంతర
[ధ్వాం]తప్రచండమార్తాండహేతి
|
|
తే. |
క్రూరకల్మష[కుంభి]కంఠీరవంబు
భీకరాఘౌఘ[1]పవనకుంభీనసంబు
కుటిలకిల్బిషపాథోధికుంభసూతి
భాసురంబైన శ్రీవిష్ణువాసరంబు.
| 169
|
చ. |
ఋతువులలో వసంతము మహీధరసంతతిలో సువర్ణప
ర్వతము గ్రహంబులందు దినరాజు తరంగిణులందు [2]గంగ గో
వితతులో మరుత్సురభి వేల్పులలో హరిఁ [3]బోలె నుత్తమ
వ్రతములలోనఁ జక్రధరవాసరసువ్రత మొప్పు నెంతయున్.
| 170
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము
- ↑ చ.భేక
- ↑ చ.నున్న
- ↑ చ.వోవు