Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీనాథుఁడు – భీమఖండము [3-51]

సీ.

సర్వంసహ[కుఁ గాసె సమకట్టు] పుట్టంబు
              గగనంబునకు వెల్లఁ గలువసెజ్జ
[1]యవటంబు మేఘ[వాహను] గంధకరటికి
              నభ్యవహార మౌర్వాగ్నిశిఖకు
వంటిల్లు [యామినీశ్వ]రకళామౌళికి
              [2]దరిచోటు నిఖిలబృందారకులకుఁ
గూ[టకచ్ఛప]నాయకునకు [3]నిశాంతంబు
              [4]మరుజనకునికిని మనికిపట్టు


తే.

[ఘనతరో]ద్దండపాఠీనకమఠనక్ర
తిమితిమింగలచక్రవిక్రమవిహార
ఘుమఘుమారంభగంభీరఘోషఘటిత
[5]లటహదిక్ప్రతిశబ్దోపలబ్ధి యబ్ధి.

140

చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [1-26]

సీ.

అఖిలలోకానందుఁడగు చంద్రుఁ డెందేనిఁ
              గలిగె నుజ్జ్వలఫేనకణము మాడ్కి
నైరావతాదిమహాకరు లెందేనిఁ
              బ్రభవించె మకరశాబముల పగిదిఁ
గమనీయసురతరుసముదయం బెందేని
              జనియించె శైవాలచయము భంగి
భువనైకమాత మాధవుపత్ని యెందేనిఁ
              బొడమె మాణిక్యంపుబొమ్మ పోల్కి


తే.

ఆదిమత్స్యకూర్మములు విహారలీలఁ
దనరు నెందేని ప్రకృతిసత్త్వముల కరణి
నట్టి యంబోధి యేపారు నద్భుతైక
సారమహనీయమహిమ [కాధార]మగుచు.

141

జయతరాజు ముమ్మన – విష్ణుకథా[నిధానము]

సీ.

గాంభీర్యసంపద గణుతించు నప్పుడు
              తన్ను [మొదలుగాఁ]గ నెన్నవలయు
సకలంబు లోఁగొను సద్గుణం బె[న్నుచో]
              దను నిదర్శనముగా వినుతిసేయుఁ
గడు నేచియు [దమించుక]డఁ దమిఁ జెప్పుచోఁ
              దనకు మర్యాద యుదాహ[రణము]

  1. చ.వ్యాపంబు
  2. చ.తలిచాటు
  3. చ.వేశంతంబు
  4. చ.మరుదయర్జునునికి మర్దనునికి
  5. గ.లటదిశాప్రతి