|
పన్ని పంచి యొక్కటి నాడఁబంచి వ్రాలుఁ
దప్పనో పత్రనయమునఁ దాన గెలిచె.
| 124
|
మృగమునకు
భాస్కరుఁడు – అరణ్యకాండము [2-25]
సీ. |
నెలలోని యిఱ్ఱికి నీలకంఠునిచేతఁ
బొలుపారు లేడికిఁ బుట్టెనొక్కొ
యజుఁ డన్ని రత్న[౦బులందునుం గ]లుగు క్రొ
మ్మించుల దీనిఁ గల్పించెనొక్కొ
రోహిణా[చలము మే]రువుఁ గూడి [1]యురుతర
ప్రభల నీ హరిణంబుఁ బడసెనొక్కొ
క్రొక్కారు మెఱుఁగుల [జుక్కల యొఱపును]
గలిసి యా మృగమయి వెలసెనొక్కొ
|
|
తే. |
దీనిఁ బోలంగ జంతువుల్ త్రిభువనముల
యందు [మఱి కలవొకొ యని] యాత్మ మెచ్చి
ప్రీతి వనదేవతలు సూడ సీ[తదృష్టి]
మార్గమున కల్లఁ [2]జనియె నమ్మాయలేడి.
| 125
|
పిల్లలమఱ్ఱి పినవీరన – శాకుంతలము [2-20]
సీ. |
కాలాంతరంబు మోసంబైన [విడివడి]
యరుదెంచు గాడ్పు వాహనమృగంబొ
శశముతో [నొంటక] జగతిపై వచ్చిన
చంద్రునిలోని లాంఛనమృగంబొ
వీ[రభద్రుని] కృపావీక్షణంబునఁ బున
ర్నవమై చరించు జన్నపుమృగంబొ
పార్వతీకన్యక ప్రార్థింప విడిచిన
యురగేంద్రకంకణు కరమృగంబొ
|
|
తే. |
యనఁగ మాయామృగమువోలె నా మృగంబు
ధరణిపతి బాణనిహతికిఁ దగులువడక
నదులు నగములు ఘనకాననములు గడచి
చటులగతి నేఁగె మాలినీతటమునకును.
| 126
|
- ↑ చ.యురునిజప్రభలచే నీరూపు బడసె
- ↑ చ.జేయు