Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[6-5]

ఉ.

పాదములందు బంగర[పుఁబావలు] [1]వెట్టి దుకూలకంథమై
మోదముతోడఁ దాల్చి జనమోహ[నమా]రణధాతువాదయం
త్రాదిసమస్తవిద్యలఁ సమర్థు లనందగు [శిష్య]పఙ్క్తి య
త్యాదరభక్తి రెండు మెయిలందుఁ దనుం గొలువ న్మహోన్నతిన్.

115

తెనాలి రామలింగయ - కందర్పకేళీవిలాసము

సీ.

మౌళి గెంజడల జొంపము ఫాలపట్టిక
              దీండ్రించు భసితత్రిపుండకంబు
కర్ణకీలితరత్నకామాక్షియుగళంబుఁ
              బలుచని నెమ్మేనిఁ బట్టుకంథ
కరముల బంగారుసరకట్టుఁ గిన్నెర
              హరిణశృంగంబుఁ బేరురమునందుఁ
గరమూలమున భూరి[2]తరవారి సన్నంపు
              నడుమున నొడ్డియాణంబు దిద్దు


తే.

[3]పిఱుఁదుపై వ్యాఘ్రచర్మకౌపీనకలన
యోగవాగలు శూలంబు నాగసరము
పొలుపు దళుకొత్తు చెట్టునఁ బుట్టినట్లు
నిరుపమాకారసిద్ధుఁ డరుగుఁదెంచె.

116

జక్కన – విక్రమార్కచరిత్రము [7-14]

సీ.

[4]మత్తికాటుక పొత్తు మరగిన నునుఁగెంపుఁ
              జూపులఁ గలికిమించులు నటింపఁ
బెక్కువన్నెల కంథ [5]చక్కిఁ జిక్కక నిక్కి
              చనుదోయి కెలఁకులఁ [6]జౌకళింప
సంకుఁబూసల క్రొత్తసరులు నిగారించి
              [కంబుకంఠము] నూత్నకాంతి నొసఁగ
పలుగుఁగుండలముల ప్రభఁ బ్రోదిసేయు[చుఁ
              జెక్కులఁ జిఱు]నవ్వు చెన్ను [7]మీఱ


తే.

యోగదండాగ్రగతపాణియుగళి[మీఁద]
[జబుకభా]గంబు నిలిపి రాచిలుకతోడ

  1. చ.పట్టు
  2. చ.కరవాలు
  3. చ.పెరుగు
  4. చ.మంతరౌటురపొందు
  5. చ.జిక్కుననక్కు
  6. చ.జనువుమెరయ
  7. చ.లొత్త