Jump to content

పుట:ప్రబంధరత్నాకరము.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దిరాజు - ప్రద్యుమ్నచరిత

ఉ.

మీనపతాకకేలిఁ దమ మేను లెఱుంగక వ్రాలునప్డు సూ
న్యూనత తమ్మితేనియల నూనిన తేంట్లన నొప్పు నచ్చటన్
దౌ నలినారచేతమును నజ్జని వ్రేళ్ళను బెల్లగింపఁగాఁ
బూని య[నే]కరూపములఁ బుట్టినభంగిఁ గళంకితచ్ఛవిన్.

92

జలకేళి

పెద్దిరాజు – అలంకారము [3-117]

క.

నీరజములుఁ జెంగలువలుఁ
గైరవములు వీచికలును గరయంత్రపయో
ధారలు నావర్తంబులు
వారివిహారంబునందు వర్ణము లరయన్.

93

[3-118]

చ.

వళులును వీచికావళులు వారిరుహంబులు వక్త్రపంక్తులున్
జెలువగు నాభులున్ [1]నుడులుఁ జేతులు రక్తసరోరుహంబులున్
జలదలకంబులున్ మధుపజాలము వీడ్వడఁ గేలి సల్పి మిం
చులు గొను చూడ్కులన్ సతులు సూతురు విశ్వనృపాలమన్మథున్.

94

[2]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-43]

సీ.

కదళిక లను కంటెఁ [3]గరభంబు లను కంటె
              నిభకరంబులఁ బోల్చ నిప్పు డనువు
చక్రంబు లను కంటె శకటాంఘ్రు లను కంటె
              నిసుక[4]తిప్పలఁ బోల్చ నిప్పు డొప్పు
గుచ్ఛంబు లను కంటె కుధరంబు లను కంటె
              నిఱి జక్కవలఁ బోల్ప నిప్పు [5]డొనరు
నద్దంబు లను కంటె నమృతాంశుఁ డను కంటె
              [6]నెల తమ్మి [7]గమిఁ బోల్ప నిపుడు తగవు


ఆ.

నాఁగఁ బొలిచి రంగనలు నీటియాటల
కెచ్చరించి [8]తఱియు నెడఁ గొలఁకుల
తోయసంగమమునఁ దొడలను బిరుదులఁ
వలచనుంగవలను వదనములను.

95
  1. చ.దిరులు
  2. సుంకిసాల
  3. కుధరంబు
  4. చ.దిబ్బల
  5. చ.డొప్పు
  6. చ.నేలు
  7. చ.ధగ
  8. చ.తలియు